విజయ్ కు సపోర్ట్ గా స్టార్ హీరోస్!
విజయ్ దేవరకొండ కు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ గా నిలిచింది. ఎప్పటినుండో తనను ఫేక్ న్యూస్ ల తో కొన్ని వెబ్ సైట్స్ ఇబ్బంది పెడుతున్నాయి [more]
విజయ్ దేవరకొండ కు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ గా నిలిచింది. ఎప్పటినుండో తనను ఫేక్ న్యూస్ ల తో కొన్ని వెబ్ సైట్స్ ఇబ్బంది పెడుతున్నాయి [more]
విజయ్ దేవరకొండ కు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ గా నిలిచింది. ఎప్పటినుండో తనను ఫేక్ న్యూస్ ల తో కొన్ని వెబ్ సైట్స్ ఇబ్బంది పెడుతున్నాయి అని అయితే నేను ఎప్పుడు వాటి గురించి రెస్పాండ్ కాలేదని కానీ ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సివస్తుందని నిన్న ఓ వీడియో ను పోస్ట్ చేసాడు విజయ్.
తాను స్థాపించిన 'మిడిల్ క్లాస్ ఫండ్' కార్యకలాపాల్ని ఎద్దేవా చేస్తూ – సామాజిక సృహ లేకుండా ప్రవర్తించిన ఓ వెబ్ సైట్‌పై – విరుచుకుపడుతూ ఓ వీడియో రూపొందించాడు విజయ్. తమ గురించే న్యూస్ లు రాసి ఆయా వెబ్ సైట్స్ డబ్బు సంపాదించుకుంటున్నాయి విరుచుకుపడ్డాడు విజయ్. కిల్ ద ఫేక్ న్యూస్ అంటూ ఓ నినాదంతో – ముందుకొచ్చాడు. అయితే విజయ్ కు చాలా అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మహేష్ బాబు, చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరోస్ విజయ్ కు సపోర్ట్ గా నిలవడం ఆశర్యం కలిగించే విషయం. మహేష్, చిరు తో పాటు హరీష్ శంకర్, కొరటాల, రవితేజ, క్రిష్ సపోర్ట్ గా నిలిచారు. ” విజయ్ వి స్టాండ్ విత్ యూ” అంటూ రిప్లయ్ లు ఇస్తున్నారు. అయితే అనుకోకుండా విజయ్ కు ఇంత సపోర్ట్ రావడంతో ఆయా వెబ్ సైట్స్ ను బాన్ కూడా చేసే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందో …