బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఆయనేనా..?
బిగ్ బాస్ షో హిందీ తరువాత తెలుగునే అంతగా పాపులర్ అయింది. తెలుగులో మొదటి సీజన్ ని హోస్ట్ చేసి పైన కుర్చోపెట్టిన ఎన్టీఆర్ సెకండ్ సీజన్ [more]
బిగ్ బాస్ షో హిందీ తరువాత తెలుగునే అంతగా పాపులర్ అయింది. తెలుగులో మొదటి సీజన్ ని హోస్ట్ చేసి పైన కుర్చోపెట్టిన ఎన్టీఆర్ సెకండ్ సీజన్ [more]
బిగ్ బాస్ షో హిందీ తరువాత తెలుగునే అంతగా పాపులర్ అయింది. తెలుగులో మొదటి సీజన్ ని హోస్ట్ చేసి పైన కుర్చోపెట్టిన ఎన్టీఆర్ సెకండ్ సీజన్ చేయలేకపోయాడు. నాని రంగప్రవేశం చేసినా షోకి అంత క్రేజ్ రాలేదు. ఎన్నో సమస్యలు, ఎన్నో ట్రోల్స్ మధ్య సెకండ్ సీజన్ ముగిసియింది. ఇక మూడో సీజన్ ని కూడా త్వరగా స్టార్ట్ చేయనున్నారు. అయితే హోస్ట్ ఎవరు అనేది ఇంత వరకు క్లారిటీ లేదు. వెంకటేష్ అన్నారు కానీ ఆయన చేయనని చెప్పేశారని టాక్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 3 కోసం ఎన్టీఆర్ ను సంప్రదించినట్టు టాక్. ఆయన కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని బోగట్టా.
రాజమౌళి ఒప్పుకుంటారా..?
స్టార్ గ్రూప్ రీసెంట్ గా డిస్నీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దాంతో పాటే మాటీవీ కూడా. అందువలన మరింత పకడ్బందీగా సీజన్ 3 చేయాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరి ఎన్టీఆర్ ఓకే చేస్తే ఎప్పుడూ చేస్తాడనేది అసలు సమస్య. ఆర్ఆర్ఆర్ సినిమా షెడ్యూళ్ల గ్యాప్ లో చేసే ఆలోచనలు సాగుతున్నాయి. మరి రాజమౌళి తన షూటింగ్ లో ఉండగా ఆయన హీరోస్ మరో వాటిపైన ఫోకస్ చేయడం ఇష్టం ఉండదు. మరి ఎన్టీఆర్ రాజమౌళికి ఏం చెప్పి బిగ్ బాస్ చేస్తాడు అనేది చూడాలి. ఎన్టీఆర్ కు అందుకు తగ్గట్టు భారీ రెమ్యూనిరేషన్ నే ఆఫర్ చేసారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.