రాజమౌళి పార్టీ..స్టార్స్ హడావిడి..!
ఈ నెల 27న జైపూర్ లో డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం జరగనుందని అందరికీ తెలిసిందే. జగపతి బాబు అన్న కుమార్తె పూజా ప్రసాద్ తో కార్తికేయ వివాహం జరగనుంది. వీరిది ప్రేమ వివాహం. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ పెళ్లి జరుగుతుంది. ప్రస్తుతం ఇరు కుటుంబాల వారు ఈ పెళ్లి హడావుడిలో బిజీగా ఉన్నారు. పెళ్లి పనులు ఉండడంతో #RRR ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చకచకా ఫినిష్ చేశాడు రాజమౌళి. అయితే కొన్ని రోజుల కిందట జక్కన్న ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడట. ఈ పార్టీ కి టాలీవుడ్ నుండి చాలా మంది స్టార్స్ వచ్చారట. ప్రభాస్, మహేష్, రవితేజ, చరణ్, ఎన్టీఆర్, బన్నీతో పాటు చాలామంది స్టార్స్ హాజరయ్యారని తెలుస్తుంది.
జనవరిలో గ్రాండ్ రిసెప్షన్
హీరోలతో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా అటెండ్ అయినట్టు సమాచారం. టాలీవుడ్ నుండే కాదు బాలీవుడ్ నుండి కూడా కొంతమంది సెలెబ్రిటీలు హాజరయ్యారట. పెళ్ళికి కుటుంబ సభ్యులతో పాటు చాలా దగ్గరి సన్నిహితులు మాత్రమే వస్తారంట. అందుకే ముందుగానే రాజమౌళి టాలీవుడ్ సెలెబ్రిటీస్ కి పార్టీ ఇచ్చారని సమాచారం. జనవరి నెలలో భారీ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఈ రిసెప్షన్ కు మాత్రం జక్కన్న ఫ్యామిలీ అందరినీ ఆహ్వానిస్తున్నారట. అయితే రిసెప్షన్ డేట్ మాత్రం ప్రకటించలేదు. #RRR రెండో షెడ్యూల్ ను సంక్రాంతి తర్వాత మొదలు పెట్టనున్నారని టాక్. అలా ఒక పక్క #RRR తో, ఇంకో పక్క పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు రాజమౌళి.