Mon Dec 23 2024 08:58:48 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ లో ప్రమాదం.. స్టంట్ మాస్టర్ మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. దాంతో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కాగా.. ఈ ప్రమాదం శనివారం..
తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో.. దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న సినిమా "విడుతలై". ప్రస్తుతం చెన్నైలోని శివారు ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఫైట్ సీన్ చేస్తుండగా.. స్టంట్ మాస్టర్ సురేష్ తాడు పై నుండి కిందపడ్డాడు. సురేష్ కు తీవ్రగాయాలు కావడంతో.. వెంటనే మూవీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. దాంతో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కాగా.. ఈ ప్రమాదం శనివారం జరిగింది. సురేష్ మృతి పట్ల విజయ్ సేతుపతి సహా.. విడుతలై చిత్రబృందం, తమిళ ప్రముఖ నటీనటులు సంతాపం తెలిపారు. సురేష్ ఆకస్మిక మరణం కారణంగా విడుతలై షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.
Next Story