Mon Dec 23 2024 07:31:17 GMT+0000 (Coordinated Universal Time)
Ram Setu: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీపై సుబ్రహ్మణ్య స్వామి హాట్ కామెంట్
ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న రామ సేతు చిత్రంపై మరోసారి స్పందించారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈమె కూడా ఈ సినిమాలో ఉందా.? అంటూ ఆశ్చర్యకరమైన ప్రశ్న సంధించారు. రామసేతు కథను వక్రీకరిస్తున్నారని.. వాస్తవాలను వక్రీకరించడం హిందీ సినిమాకు అలవాటుగా మారిందని ఆయన గతంలో తీవ్ర విమర్శలు చేశారు. రామ సేతు వాస్తవాలను వక్రీకరించారని.. ఆ సినిమా స్క్రిప్ట్‌ను తనకు పంపించాలని ఆయన రామ సేతు టీంకి లీగల్ నోటీసులు కూడా పంపారు. అక్షయ్ కుమార్ సహా మరో ఎనిమిది మందికి ఆయన లీగన్ నోటీసులిచ్చారు.
ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది. సుమారు రూ.200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌తో ఆమెకు సంబంధాలున్నాయని.. వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయని ఈడీ పేర్కొంది. ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు, వజ్రాభరణాలు, భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. సుకేష్ నేరచరిత్ర తెలిసినప్పటికీ జాక్వెలిన్ అతనితో పరిచయం కొనసాగించిందని.. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా సుకేష్ నుంచి లబ్ధి పొందినట్లు ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. తనకు దుస్తులు, బ్యాగులు, వజ్రాలతో పొదిగిన చెవిదిద్దులు బహుమతులుగా ఇచ్చినట్లు విచారణలో స్వయంగా జాక్వెలిన్ చెప్పినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె కోసం ప్రైవేట్ జెట్ ప్రయాణాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీంతో జాక్వెలిన్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. అదే విషయంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాస్త వ్యంగ్యంగా స్పందించారు. రామ సేతు వాస్తవాలను వక్రీకరిస్తున్నారంటూ ఇప్పటికే సినిమా టీంకి నోటీసులు పంపిన స్వామి.. ఈ మోసపూరిత టీంలో ఈమె కూడా ఉందా? అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
News Summary - Subramanian Swamy takes legal action against Akshay Kumar Jacqueline Fernandez Ram Setu makers
Next Story