విజయం ఇంట్లో కూడా ఉంటుంది అంటున్న హీరోయిన్
ఎప్పుడు కెరీర్ లో సక్సెస్ అవుతూ విజయాలను సాధించడమే లైఫ్ అనుకునే హీరోయిన్స్ చాలామంది లాక్ డౌన్ లో జీవిత సత్యాలను తెలుసుకున్నామంటూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. [more]
ఎప్పుడు కెరీర్ లో సక్సెస్ అవుతూ విజయాలను సాధించడమే లైఫ్ అనుకునే హీరోయిన్స్ చాలామంది లాక్ డౌన్ లో జీవిత సత్యాలను తెలుసుకున్నామంటూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. [more]
ఎప్పుడు కెరీర్ లో సక్సెస్ అవుతూ విజయాలను సాధించడమే లైఫ్ అనుకునే హీరోయిన్స్ చాలామంది లాక్ డౌన్ లో జీవిత సత్యాలను తెలుసుకున్నామంటూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కాజల్ అయితే ఏకంగా పెళ్లి పీటలెక్కుతుంది. శృతి హాసన్ లాక్ డౌన్ లో నన్ను నేను తెలుసుకునే అంటుంటే.. అక్కినేని సమంత మాత్రం సాధించడమే విజయం అనుకునే నేను ఇంట్లోనూ విజయం ఉంటుంది అని ఈ కరోనా లాక్ డౌన్ లోనే తెలుసుకున్నా అంటుంది. కరోనా లాక్ డౌన్ లో అందరికన్నా ఎక్కువగా సమంత చాలా కొత్తగా ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల శ్రద్ద తీసుకుంది. అంతేకాకుండా మెగా కోడలు ఉపాసన చేపట్టిన ఆరోగ్యం మహాభాగ్యం యువర్ లైఫ్ ప్రాగ్రాం కోసం తన వంతు సహాయం చేస్తుంది.
అయితే కరోనా లాక్ డౌన్ వలన తనకి తగినంత ఖాళీ సమయం దొరికింది అని.. తన కెరీర్ లో ఖాళీ సమయం అన్న పదానికి చోటు ఉండదు. కానీ లాక్ డౌన్ లో తగినంత సమయం దొరికింది. ఈ సమయం బంధాలు పెంచుకోవడానికి బాగా తోట్పడింది. ఇక సాధించడమే విజయం అనుకునే దాన్ని. కానీ ఇంట్లోనే విజయం ఉంది అని లాక్ డౌన్ లో తెలుసుకున్నా.. ప్రియమైన వారిని ఆరోగ్యంగా చూసుకోవడం, అలాగే సంతోషం గా ఉండేలా చూసుకోవడం కూడా గొప్ప విజయమే. అలానే సినిమా సక్సెస్ లు మాత్రమే మనలో స్ఫూర్తి నింపి ముందుకు తీసికెళతాయని నమ్మేదాన్ని.
కానీ మొక్కలు పెంచడం నాలో ప్రేరణ కలిగేలా చేసింది. రోజు లేవగానే నేను పెట్టినమొక్కలు ఎంత ఎదగాయో అనే అతృతతో చూస్తుంటాను. మనలో స్ఫూర్తి నింపే విషయాలు మన చుట్టూనే ఉంటాయి. ఆ అందం ప్రతి దానిలోనూ ఉంటుంది. మీరు మొక్కలు దగ్గరైనా, లేదా ఎక్కడైనా కాస్త టైం స్పెండ్ చేసి.. గమనిస్తే ఆ సంతోషంగా, ఆనందం అన్ని మీ వెంటే ఉంటాయి అంటుంది అక్కినేని కోడలు సమంత.
- Tags
- samantha