Mon Dec 23 2024 18:44:55 GMT+0000 (Coordinated Universal Time)
అల్ జజీరాలో ఉడుముల సుధాకర్ డాక్యుమెంటరీ
ఈ కథనాలపై ఇన్వెస్టిగేషన్ చిత్రీకరణ సింగపూర్, జవాది హిల్స్, దుబాయ్ , చెన్నై, హైదరాబాద్
అంతర్జాతీయ ఛానల్ ALJAZEERA (అల్జజీరా) లో హ్యూగో వాన్ ఆఫెల్, ఉడుముల సుధాకర్ రెడ్డి లు సంయుక్తంగా ఎర్రచందనం అక్రమ రవాణా పై చేసిన ఇన్వెస్టిగేషన్ కథనం ప్రసారం అయ్యింది. ఉడుముల సుధాకర్ రెడ్డి రాసిన పుస్తకం ఆధారంగా ఫ్రాన్స్ దేశంలోని TV OTT ల్లో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో కథనాలు ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం ALJAZEERA ఛానెల్ లో ENGLISH లో సంక్షిప్త కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ కథనాలపై ఇన్వెస్టిగేషన్ , చిత్రీకరణ సింగపూర్, జవాది హిల్స్, దుబాయ్ , చెన్నై, హైదరాబాద్, విజయవాడ చిత్తూరు, తిరుపతి , శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగింది. ఇందుకు ఇంటర్ పోల్, DRI, ఏపీ పోలీసులు, టాస్క్ ఫోర్స్, ఫారెస్ట్ అధికారుల ఇంటర్వ్యూ లు, విశ్లేషణలు కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన యూట్యూబ్ లింక్ ఇక్కడ మీకోసం ఇచ్చాం..
ఈ వీడియోకు ఇప్పటికే రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సాహుల్ హమీద్ అనే వ్యక్తి ఎలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏకంగా ఎర్ర చందనం స్మగ్లర్ గా మారాడో ఈ డాక్యుమెంటరీలో వివరించారు. అతడు శేషాచలం అడవుల్లో ఎర్ర చందనాన్ని కొల్లగొడుతూ కొన్ని వందల కోట్లను వెనకేసుకొచ్చాడు. ఆ తర్వాత దుబాయ్ కు మకాం మార్చి.. అక్కడి నుండి ఎర్ర చందనం స్మగ్లింగ్ ను శాసించడం మొదలుపెట్టాడు. అలాంటి వ్యక్తి కొడుకు భారత్ కు వచ్చి పోలీసులకు పట్టుబడితే.. ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది ఇందులో వివరించారు. ప్రముఖ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల ఎంతో సమాచారాన్ని తన పుస్తకం 'బ్లడ్ సాండర్స్ ది గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్' పొందుపరిచారు. తప్పక చదవాల్సిన పుస్తకం. ఎక్కడో అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే మనకు ఏమి నష్టం అని అనుకునే వాళ్ళందరి కళ్లు తప్పకుండా తెరిపిస్తుంది.
Next Story