Mon Dec 23 2024 06:11:42 GMT+0000 (Coordinated Universal Time)
సుడిగాలి సుధీర్ ఈజ్ బ్యాక్.. కానీ ఆ ఒక్కరోజు మాత్రమే !
తాజాగా ఈటీవీ 27వ వార్షికోత్సవం కొత్త ప్రోమోను విడుదల చేయగా.. అందులో అనసూయ, సుధీర్ సహా పలువురు కమెడియన్లు..
జబర్దస్త్ లో కమెడియన్ గా చేరి.. అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కనిపించట్లేదు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లలో తన యాంకరింగ్, కామెడీతో అభిమానులను సంపాదించుకున్న సుధీర్.. ఉన్నట్లుండి ఆ షో ల నుంచి తప్పుకున్నాడు. ఇందుకు ప్రధాన కారణం సుధీర్ కు పారితోషికాన్ని పెంచకపోవడమే అని అభిమానులు అనుకున్నారు. మళ్లీ ఎప్పటికీ సుధీర్ ఆయా షో లలో కనిపించబోడని అందరూ అనుకున్నారు.
తాజాగా ఈటీవీ 27వ వార్షికోత్సవం కొత్త ప్రోమోను విడుదల చేయగా.. అందులో అనసూయ, సుధీర్ సహా పలువురు కమెడియన్లు కూడా రానున్నారు. సుధీర్, చంద్ర, అనసూయ లు గెస్ట్ లుగా వస్తున్న ప్రోమో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. సుధీర్ మళ్లీ ఈటీవీలో ఉండాలని కోరుతూ.. అభిమానులు కామెంట్లు చేస్తున్నారు కానీ.. సుధీర్ కేవలం గెస్ట్ గా మాత్రమే వస్తున్నాడట. ఫుల్ ఎంటర్టైన్ మెంట్ తో నిర్వహించిన ఈటీవీ 27వ వార్షికోత్సవ ఫంక్షన్ ఈ ఆదివారం (ఆగస్టు 29)న టెలీకాస్ట్ కానుంది. ఈటీవీ మల్లెమాల నుంచి వెళ్లిపోయిన వారిలో చాలా మంది ఈ షో లో కనిపించనుండటంతో ఈ ఎపిసోడ్ కు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.
Next Story