Mon Dec 23 2024 02:32:07 GMT+0000 (Coordinated Universal Time)
వీరసింహారెడ్డి నుండి మాస్ బీట్ తో "సుగుణ సుందరి"
'సీమా కుట్టిందే .. సిట్టి సీమా కుట్టిందే.. దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే' అంటూ సాగే ఈ పాటను బాలయ్య..
బాలకృష్ణ హీరోగా.. మరోసారి ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతోన్న సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీమూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుండి "సుగుణ సుందరి" మాస్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.
'సీమా కుట్టిందే .. సిట్టి సీమా కుట్టిందే.. దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే' అంటూ సాగే ఈ పాటను బాలయ్య - శ్రుతి హాసన్ పై చిత్రీకరించారు. తమన్ సంగీత బాణీలు అందించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. రామ్ మిర్యాల, స్నిగ్ద శర్మ పాటను ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మాస్ బీట్ తో సాగే పాట..మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. బాలయ్య డబుల్ రోల్ లో బాలకృష్ణ - శృతిహాసన్ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ లో వచ్చిన సినిమాలు బాలయ్యకు మంచి విజయాలను తెచ్చిపెట్టాయి. సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా, లెజెండ్, అఖండ సినిమాలు భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. వీరసింహారెడ్డి కూడా భారీ హిట్ కొడుతుందని అంచనాలున్నాయి.
Next Story