Mon Dec 23 2024 06:10:37 GMT+0000 (Coordinated Universal Time)
రామ్ చరణ్ RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్.. మాములుగా లేవుగా!
రామ్ చరణ్ RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పక్కా ప్లానింగ్ తో జరుగుతున్నాయిగా. తాజాగా దర్శకనిర్మాతలు అందరూ కలిసి..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన తదుపరి సినిమా RC16.. 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబుతో (Buchi Babu Sana) చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా బుచ్చిబాబు 'ఉప్పెన' సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో.. RC16 పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా స్క్రిప్ట్ పై బుచ్చిబాబు దాదాపు నాలుగేళ్లు పాటు వర్క్ చేశాడట.
ఎంతో కష్టపడి, చాలా పక్కాగా స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసుకున్నాడు. మూవీ విజయం సాధిచడంలో ఎటువంటి సందేహం లేదని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. దీంతో ఈ మూవీ ఎప్పుడు మొదలు అవుతుందా..? అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ 'గేమ్ చెంజర్' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరిలో పూర్తి అవ్వనుంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ లేదా 2024 జనవరిలో సెట్స్ పైకి వెళ్తుందని పేర్కొన్నాడు. తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఏకంగా ఒక కొత్త ఆఫీస్ నే ఓపెన్ చేశారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా దర్శకనిర్మాతలు అందరూ కలిసి కొత్త ఆఫీస్ ని పూజా కార్యక్రమాలతో ఘనంగా ఓపెన్ చేశారు.
అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. 'ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పక్కా ప్లానింగ్ తో జరుగుతున్నట్లు' వెల్లడించారు. ఇక వీరి ప్లానింగ్ చూస్తుంటే.. మూవీని పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకు వెళ్ళబోతున్నారని అర్ధమవుతుంది. త్వరలోనే ఈ మూవీలో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేయనున్నారు. కాగా ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. ఇక మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా తెరకెక్కబోతుంది తెలుస్తుంది.
Next Story