Wed Dec 25 2024 04:20:50 GMT+0000 (Coordinated Universal Time)
రాజీవ్ తో విడాకులపై స్పందించిన సుమ
మే 19న ఈ సినిమా విడుదల కానుండగా.. శనివారమే ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు
హైదరాబాద్ : ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల చాలా సంవత్సరాల తర్వాత జయమ్మ పంచాయితీ అనే సినిమా తో వెండితెరపై కనిపించనుంది. మే 19న ఈ సినిమా విడుదల కానుండగా.. శనివారమే ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ తో విడాకులపై వస్తున్న రూమర్లపై స్పందించారు. పెళ్లై 23 ఏళ్లు అయిందని, ఈ 23 ఏళ్ల దాంపత్య జీవితంలో తాము చాలా సంతోషంగా ఉన్నామని సుమ కనకాల చెప్పింది.
రూమర్లు వచ్చినప్పుడల్లా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేయడం ద్వారా ఆ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశానని సుమ పేర్కొంది. ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణమేనని, ముఖ్యంగా ఫేమస్ అవుతూ.. స్టార్ డమ్ వస్తుందంటే ఇలాంటి గాసిప్ లు, పుకార్లు మరింత ఎక్కువవుతాయని సుమ చెప్పుకొచ్చింది. వీటి వల్ల మానసికంగా చాలా బాధ కలిగినా.. అందుకు అలవాటుపడి ఉన్నామని పేర్కొన్నారు.
Next Story