Thu Dec 26 2024 03:27:15 GMT+0000 (Coordinated Universal Time)
సుమ 'జయమ్మ పంచాయతీ' రిలీజ్ అప్పుడే !
సినిమా ట్రైలర్లో సుమ జయమ్మ అనే స్ట్రాంగ్ మహిళగా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఆమె తన సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని..
పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత సుమ కనకాల లీడ్ రోల్ లో నటిస్తున్న తెలుగు చిత్రం 'జయమ్మ పంచాయితీ' ఈ ఏడాది మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది.
సినిమా ట్రైలర్లో సుమ జయమ్మ అనే స్ట్రాంగ్ మహిళగా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఆమె తన సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంది. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్ గా నటించిన సుమ ఆ తర్వాత యాంకరింగ్ వైపు వెళ్లారు. ఇటీవల ఆమె జయమ్మ పంచాయితీ చిత్రం ద్వారా మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది.
విజయ్ కుమార్ దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో అందరి దృష్టి జయమ్మ పంచాయితీపై పడింది. బలగా ప్రకాశ్ నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story