Mon Dec 23 2024 13:16:58 GMT+0000 (Coordinated Universal Time)
సుమంత్ కొత్త సినిమా..!
నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ప్రముఖ కథానాయకుడు [more]
నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ప్రముఖ కథానాయకుడు [more]
నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ప్రముఖ కథానాయకుడు సుమంత్ తో ఓ భారీ చిత్రం మొదలు పెడుతున్నారు. సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ డ్రామాను సంజన ప్రొడక్షన్స్, సాయి కృష్ణా ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. సుమంత్ సరసన సిమ్రత్ నటించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. సుమంత్ ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్ తో చూపించే ఈ చిత్రానికి సంగీతం యాజమాన్య అందిస్తుండగా సినిమాటోగ్రఫీ అష్కర్ చేస్తున్నారు.
Next Story