Mon Dec 23 2024 07:45:44 GMT+0000 (Coordinated Universal Time)
Sunil Comments : తమిళ సినీ పరిశ్రమ నాకు దేవాలయం లాంటిది..
సునీల్ మాట్లాడుతూ.. తనకి హైదరాబాద్ ఇల్లు అని, కానీ తమిళ సినీ పరిశ్రమ దేవాలయం అంటూ చెప్పుకొచ్చాడు.
Sunil Comments : టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్.. ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తెలుగు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాడు. కానీ ఆ తరువాత హీరోగా టర్నింగ్ తీసుకోని కామెడీకి దూరమయ్యి.. అటు హీరో ఛాన్సులు, ఇటు కమెడియన్ ఛాన్సులు కూడా అందుకోలేక ఇబ్బందులు పడ్డాడు. అయితే పుష్ప సినిమాలో విలన్ గా మెప్పించిన సునీల్.. తెలుగు, తమిళంలో ఆ తరహా పాత్రలు అందుకుంటూ వస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా తమిళ్ మూవీ 'జపాన్'లో కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు.
కార్తీ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సునీల్ మాట్లాడుతూ.. తనకి హైదరాబాద్ ఇల్లు అని, కానీ తమిళ సినీ పరిశ్రమ దేవాలయం అంటూ చెప్పుకొచ్చాడు. తనకి తమిళ భాష రాకున్నా, తన యాక్టింగ్ పై నమ్మకం పెట్టి, తమిళ్ భాష నేర్పించి, తనని చాలామందికి తెలిసేలా చేసింది తమిళ సినిమా పరిశ్రమే అంటూ సునీల్ చెప్పుకొచ్చాడు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి పొందిన ఈ ఋణం జన్మలో తీర్చుకోలేనిదని సునీల్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక కార్తీ 'జపాన్' మూవీ విషయానికి వస్తే.. గజదొంగ కథాంశంతో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా చేస్తుంది. దీపావళి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ముక్యంగా కార్తీ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. కాగా ఈ సినిమా తమిళనాడు గజదొంగగా పేరుగాంచిన తిరువారూర్ ముర్గన్ కథతో రూపొందుతందని సమాచారం.
Next Story