Tue Dec 24 2024 01:01:26 GMT+0000 (Coordinated Universal Time)
సన్నీ లియోన్ కొత్త టీవీ షో.. తెలుగు మీడియం ఐ స్కూల్ స్టార్ట్..
టాలీవుడ్ బుల్లితెర పై తెలుగు మీడియం ఐ స్కూల్ స్టార్ట్ చేసిన సన్నీ లియోన్.
అడల్ట్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినీ పరిశ్రమకు వచ్చిన సన్నీ లియోన్ (Sunny Leone).. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ భాషల్లో నటిస్తూ వస్తుంది. తెలుగులో మంచు వారసులు మనోజ్, విష్ణు సినిమాల్లో నటించింది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటివరకు వెండితెర పై కనిపించి టాలీవుడ్ ఆడియన్స్ ని అలరించిన సన్నీ లియోన్.. ఇప్పుడు తెలుగు బుల్లితెర పై కనిపించి ఎంటర్టైన్ చేయబోతుంది.
ఒక ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ లో సన్నీ లియోన్ ఒక రియాలిటీ షో చేస్తుంది. ఆ షోని సన్నీ హోస్ట్ గా ఉండి నడిపించబోతుంది. తాజాగా ఆ షో నిర్వాహకులు ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. ఆ ప్రోమో వీడియోలో సన్నీ లియోన్ మాట్లాడుతూ.. 'తెలుగు నాకు జీవితాన్ని ఇచ్చింది. తెలుగుని ఎంటర్టైన్మెంట్ తో సెలబ్రేట్ చేసుకుందాం' అంటూ తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంటుంది. ఇక ఈ రియాలిటీ షోకి ‘తెలుగు మీడియం ఐ స్కూల్’ అని టైటిల్ ని పెట్టారు.
కాగా సన్నీ లియోన్ గతంలో కొన్ని షోలకు హోస్ట్ గా చేసింది. అయితే అవన్నీ బాలీవుడ్ కి సంబంధించినవే. సౌత్ లో సన్నీ లియోన్ చేస్తున్న మొదటి టెలివిజన్ షో ఇదే. మరి వచ్చి రాని తెలుగుతో సన్నీ లియోన్.. తెలుగు మీడియం ఐ స్కూల్ స్టార్ట్ చేసి ఏమి పాఠాలు చెప్పి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ షోలో సన్నీ లియోన్ తో పాటు టాలీవుడ్ యాంకర్ రవి కూడా హోస్ట్ గా కనిపించబోతున్నాడు.
సన్నీ లియోన్ టాలీవుడ్ కి 2014లో 'కరెంటు తీగ' సినిమాలో నటించి ఎంట్రీ ఇచ్చింది. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో సన్నీ లియోన్ టీచర్ గా నటించడం విశేషం. వెండితెర పై టీచర్ గా ఎంట్రీ, బుల్లితెరపై కూడా టీచర్ ఎంట్రీ. ఇక తెలుగులో కరెంటు తీగ సినిమా తరువాత 'గరుడ వేగా' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక చివరిగా ఇటీవల మంచు విష్ణు 'జిన్నా' సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసింది.
Next Story