Mon Dec 23 2024 11:34:00 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ తో మెగా భేటీ పై రెచ్చిపోయిన ఆర్జీవీ.. బాహుబలిని మించిన బెగ్గింగ్ అంటూ
సూపర్, మెగా, బాహుబలి స్థాయిలో అడుక్కోవడం వల్లే ఈ సమావేశం జరిగిందని, ఒమెగాస్టార్ సీఎం జగన్ వారందరికీ వరాలిచ్చారని
నిన్న సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భేటీపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో స్పందించారు. మెగా భేటీపై వరుస వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టాలీవుడ్ స్టార్ హీరోలపై కూడా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బాహుబలిని మించిన బెగ్గింగ్ అంటూ ట్వీట్ చేశారు.
Also Read : ఏపీలో ఆగిపోయిన కులధృవీకరణ సర్టిఫికేట్ల జారీ..!
సూపర్, మెగా, బాహుబలి స్థాయిలో అడుక్కోవడం వల్లే ఈ సమావేశం జరిగిందని, ఒమెగాస్టార్ సీఎం జగన్ వారందరికీ వరాలిచ్చారని ట్వీట్ లో రాసుకొచ్చారు. బాహుబలిని మించిన మహాబలి వైఎస్ జగన్ చొరవను తాను ఎంతో అభినందిస్తున్నానని చెప్పారు. అలాగే ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అధిగమించి.. భవిష్యత్ లో అంతా సాఫీగా జరిగేందుకు దారిచూపిన ఒమెగాస్టార్ సీఎం జగన్ ను అభినందించాలన్నారు.
Next Story