Tue Dec 24 2024 03:35:33 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచం మెచ్చిన సూపర్ మోడల్ అలా దొరికిపోయింది
ఫ్యాషన్ ప్రపంచంలో సూపర్ మోడల్ ఎవరు అంటే జిగి హడిద్ అని అంటారు. కొద్ది నెలల కింద భారత్ లో కూడా ఆమె సందడి చేసి వెళ్ళిపో
ఫ్యాషన్ ప్రపంచంలో సూపర్ మోడల్ ఎవరు అంటే జిగి హడిద్ అని అంటారు. కొద్ది నెలల కింద భారత్ లో కూడా ఆమె సందడి చేసి వెళ్ళిపోయింది. తాజాగా జిగి హడిద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. కేమాన్ దీవులలో విహారయాత్ర చేస్తున్నప్పుడు ఆమె దగ్గర గంజాయి ఉండడంతో జిగి హడిద్ ను అరెస్టు చేసినట్లు నివేదించారు. ఆమె అరెస్టు సమయంలో ఆమె స్నేహితురాలు లియా నికోల్ మెక్‌కార్టీతో కలిసి ప్రయాణిస్తోంది. కేమాన్ మార్ల్ రోడ్ ప్రకారం, జూలై 10న విమానాశ్రయానికి చేరుకున్న అధికారులు ఆమె లగేజీని స్కాన్ చేయగా.. అందులో గంజాయి ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
జిగి హడిద్ యూకేలోని ఓ విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడింది. నికోల్ మెక్‌కార్టీతో కలిసి అమెరికా నుంచి ప్రైవేట్ విమానంలో యూకేలోని కైమన్ ద్వీపానికి చేరుకుంది. ఓవెన్ రాబర్ట్స్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా గంజాయి, దానిని తాగడానికి ఉపయోగించే వస్తువులు ఆమె వద్ద లభించాయి. దీంతో అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేశారు.
జూలై 12న కోర్టుకు హాజరైన తర్వాత ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. వారికి $1,000 జరిమానా విధించారు. జిగి హడిద్ వైద్యుల సూచన మేరకే గంజాయితో ప్రయాణిస్తూ ఉందని ఆమె ప్రతినిధులు తెలిపారు. 2017 నుండి గ్రాండ్ కేమాన్లో వైద్యపరమైన ఉపయోగం కోసం గంజాయిని చట్టబద్ధం చేశారు. ఆమె రికార్డు స్పష్టంగా ఉందని తెలిపారు ప్రతినిధులు. ఈ అరెస్టు పర్వం తర్వాత కూడా ఆమె తన వెకేషన్ ను ఎంజాయ్ చేసింది.
Next Story