Fri Mar 21 2025 08:17:11 GMT+0000 (Coordinated Universal Time)
దుబాయ్ లో మహేష్ ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ !
టాలీవుడ్, బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీ కపుల్స్ వివిధ దేశాల్లో న్యూ ఇయర్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. వారిలో ఒకటి మహేష్ ఫ్యామిలీ. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తన

న్యూ ఇయర్ వచ్చేసింది. ప్రపంచ దేశాలన్నీ 2021ని సాగనంపి.. 2022 కి ఘనంగా స్వాగతం పలికాయి. పలువురు టాలీవుడ్, బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీ కపుల్స్ వివిధ దేశాల్లో న్యూ ఇయర్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. వారిలో ఒకటి మహేష్ ఫ్యామిలీ. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తన భార్య నమ్రతా శిరోద్కర్, కొడుకు, కూతురితో కలిసి దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. మహేష్ కుటుంబమంతా కలిసి అక్కడ ఎంతో ఆనందంగా.. విందును ఆస్వాదించినట్లు మహేష్ షేర్ చేసిన ఫొటోలో తెలుస్తోంది. అభిమానులకు వారి సన్నిహిత విహారయాత్ర గురించి స్నీక్ పీక్ ఇవ్వడానికి మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ అందరికీ స్ఫూర్తిదాయకంగా విషెస్ చెప్పారు.
న్యూ ఇయర్ సందర్భంగా మహేష్ పోస్ట్ చేసిన ఆ ఫోటో కింద.. "నూతన ప్రారంభాల మేజిక్ ను నమ్మండి! సంతోషంగా ఉండండి, దయతో ఉండండి, కృతజ్ఞతతో ఉండండి! నూతన సంవత్సర శుభాకాంక్షలు #2022! అందరూ సురక్షితంగా ఉండండి. మీ అందరిపై అభిమానంతో" అంటూ రాసుకొచ్చారు. గతేడాది సరిలేరు నీకెవ్వరు తో అలరించిన మహేష్ బాబు.. నూతన సంవత్సరంలో సర్కారు వారి పాట తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా పేర్కొంటున్న ఈ సినిమా కథ అంతా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతి చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. నిజానికి సంక్రాంతికే ఈ సినిమా రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
News Summary - Super Star Mahebabu Family Newyear Celebrations in Dubai
Next Story