Sun Dec 22 2024 08:51:51 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : రికార్డులతో రికార్డులు సృష్టిస్తున్న మహేష్ బాబు..
మహేష్ బాబు కేవలం రీజినల్ సినిమాలతోనే రికార్డులపై రికార్డులు సృష్టిస్తున్నారు. ఆ రికార్డులు ఏంటంటే..
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' టాక్ తో సంబంధం లేకుండా రికార్డు కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది. అయితే ఈ రికార్డులతో మహేష్ బాబు మరో కొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఆ రికార్డులు ఏంటంటే.. రీజనల్ సినిమాలతో మహేష్ బాబు ఇప్పటివరకు ఐదుసార్లు 100 కోట్ల షేర్ ని అందుకొని కొత్త రికార్డుని క్రియేట్ చేశారు.
‘భారత్ అనే నేను’ మూవీతో ఈ రికార్డు మొదలైంది. ఆ చిత్రం 225 కోట్ల గ్రాస్ ని అందుకొని దాదాపు 110 కోట్లు షేర్ ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రం తరువాత రిలీజైన ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలు కూడా 200 కోట్ల పై గ్రాస్ నమోదు చేసి 100 కోట్ల షేర్ తో హ్యాట్రిక్ ని నమోదు చేసింది. దీని తరువాత వచ్చిన ‘సర్కారు వారి పాట’ మూవీ సైతం 230 కోట్ల గ్రాస్‌ని అందుకొని 110 కోట్లకు పైగా షేర్ ని నమోదు చేసింది.
ఇక ఇప్పుడు రిలీజైన గుంటూరు కారం ఇప్పటివరకు దాదాపు 175 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా కూడా 200 కోట్ల గ్రాస్ ని రాబట్టి 100 కోట్ల షేర్ నమోదు చేయడం ఖాయం. ఇలా వరుసగా ఐదు సార్లు 100 కోట్ల షేర్ ని నమోదు చేయడం రికార్డు కాదు, ఐదు రీజినల్ సినిమాలతో 100 కోట్ల షేర్ ని పెట్టడం అసలైన రికార్డు. అది కూడా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేసి 200 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకోవడం మహేష్‌కే చెల్లింది.
ఇలా మరే హీరో రీజినల్ సినిమాలతో ఇలాంటి రికార్డుని నమోదు చేయలేదు. భవిషత్తులో ఈ రికార్డుని బ్రేక్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ప్రస్తుతం వస్తున్న చిన్న సినిమాలు సైతం తెలుగుతో పాటు రెండు మూడు భాషల్లో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. దీనిబట్టి చూస్తే, ఈ రికార్డు మహేష్ పేరు మీద స్థిరంగా మిగిలిపోతుంది.
Next Story