Mon Dec 23 2024 11:45:54 GMT+0000 (Coordinated Universal Time)
తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్
తండ్రిని వేనోళ్ల కీర్తిస్తూ.. చేసిన పోస్ట్ నెటిజన్ల హృదయాలను తాకింది. "నాన్నా... మీ జీవితం చరితార్థం చేసుకున్నారు.
అలనాటి సూపర్ స్టార్, హీరో మహేశ్ తండ్రి కృష్ణ ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. కుటుంబంలో వరుస మరణాలతో మహేశ్ తీవ్ర విషాదంలో ఉన్నారు. తన తండ్రి మరణించినప్పటి నుండి ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. తాజాగా మహేశ్ తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ.. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చేసిన పోస్టులు వైరలవుతున్నాయి. ఒకే ఏడాదిలో సోదరుడు, తల్లి, తండ్రి మరణాలతో తీరని విషాదంలో ఉన్నారు మహేశ్.
తండ్రిని వేనోళ్ల కీర్తిస్తూ.. చేసిన పోస్ట్ నెటిజన్ల హృదయాలను తాకింది. "నాన్నా... మీ జీవితం చరితార్థం చేసుకున్నారు. మీ నిష్క్రమణం మరింత వైభవంగా జరిగింది. అది మీ గొప్పదనం నాన్నా. మీ జీవితాన్ని మీరు నిర్భయంగా జీవించారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ నైజం. నా స్ఫూర్తి, నా గుండెధైర్యం అన్నీ మీతోనే పోయాయని అనుకున్నాను. కానీ విచిత్రం...! మునుపెన్నడూ లేనంత కొత్త శక్తి ఇప్పుడు నాలో కలిగింది. ఇప్పుడు నాకు భయమే లేదు నాన్నా! మీ దివ్యజ్యోతి నాపై ప్రసరిస్తున్నంత కాలం మీ ఘనతర వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళతాను.. మీరు మరింత గర్వించేలా చేస్తాను.. లవ్యూ నాన్నా.. మీరే నా సూపర్ స్టార్!" అంటూ మహేశ్ పోస్ట్ చేశారు.
Next Story