Mon Dec 23 2024 01:58:41 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబును వెంటాడుతున్న విషాదాలు
మహేష్ బాబును ఇటీవలి కాలంలో విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి. మహేష్ కు ఎంతో సన్నిహితులైన వ్యక్తులను
మహేష్ బాబును ఇటీవలి కాలంలో విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి. మహేష్ కు ఎంతో సన్నిహితులైన వ్యక్తులను ఏడాది కాలంలోనే కోల్పోయారు. ఆయన తల్లి ఇందిరాదేవి(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఇక మహేష్ బాబుకు ఎంతో ఆప్తుడైన వ్యక్తి రమేశ్ బాబు.. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జనవరి 8న తుదిశ్వాస విడిచారు. అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, తల్లి దూరం అవ్వడం మహేశ్‌ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఒకే ఏడాదిలో మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు దూరమయ్యారు. అటు సూపర్ స్టార్ కృష్ణ కూడా భార్యను, కుమారుడిని కోల్పోయి తీవ్రమైన శోకంలో ఉన్నారు.
ఇందిరాదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం బుధవారం మధ్యాహ్నం వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, మహేశ్ బాబు అభిమానులు తరలివస్తున్నారు. ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ... శ్రీమతి ఇందిరాదేవిగారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసిందని అన్నారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని... సూపర్ స్టార్ కృష్ణగారికి, సోదరుడు మహేశ్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
Next Story