Sun Dec 29 2024 03:00:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సూపర్ స్టార్ అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ పార్ధీవ దేహాన్ని పద్మాలయ స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
సూపర్ స్టార్ కృష్ణ పార్ధీవ దేహాన్ని పద్మాలయ స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. రెండు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు హైదరాబాద్ కు చేరుకున్నారు. కృష్ణను చివరిసారి చూసేందుకు అభిమానులు పద్మాలయ స్టూడియోలో బారులు తీరారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకూ అభిమానులను సందర్శన కోసం అనుమతిస్తారు. ఇప్పటికే పద్మాలయ స్టూడియోస్ కు రెండు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట జరగకుండా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బారులు తీరిన అభిమానులు...
12 గంటల తర్వాత పద్మాలయ స్టూడియోస్ నుంచి కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. అంతిమయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులను ఏపీకి చెందిన రాజకీయ నాయకులు ఈరోజు వచ్చి పార్ధీవదేహానికి నివాళులర్పిస్తున్నారు.
Next Story