Mon Dec 23 2024 17:14:34 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ స్టార్ కృష్ణకు ఏమైంది ? మొహం అలా ఎందుకైందంటూ అభిమానుల ఆందోళన
ఇంతకీ కృష్ణగారికి ఏమైంది ? ఆ ఫొటో ఎక్కడ తీశారు? తెలుసుకుందాం. ఇటీవలే తమ కుటుంబానికి సంబంధించిన ఒక ఫంక్షన్లో..
హైదరాబాద్ : టాలీవుడ్ అలనాటి స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృష్ణ.. తనదైన స్టైల్లో నటించి దూసుకుపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కృష్ణ పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు వయస్సు మీద పడటంతో ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు. కృష్ణగారికి ఏమైందంటూ పోస్టులు పెడుతుండటంతో.. ఆ ఫొటో వైరల్ అయింది.
ఇంతకీ కృష్ణగారికి ఏమైంది ? ఆ ఫొటో ఎక్కడ తీశారు? తెలుసుకుందాం. ఇటీవలే తమ కుటుంబానికి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను కృష్ణ కూతురు, మహేశ్ బాబు అక్క మంజుల సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలో కృష్ణ మొహంలో ఏదో తేడాగా కనిపిస్తుండటంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖం మీద ఏవో మచ్చలు వచ్చినట్టు కనిపించడంతో.. కృష్ణకు ఏమైందని వారు ప్రశ్నిస్తున్నారు.
నెటిజన్ల ప్రశ్నలకు కృష్ణ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇన్విజిబుల్ ఫేస్ మాస్క్ ధరించారని, అది ముఖంలో కలిసిపోవడంతో అలా కనిపిస్తోందని తెలిపారు. కృష్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. దాంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story