Mon Dec 23 2024 15:12:44 GMT+0000 (Coordinated Universal Time)
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ లాంచ్ చేసిన మహేష్
సినిమాలు తీసే ఓ అబ్బాయి.. సినిమాలన్నా, సినిమా వాళ్లన్నా నచ్చని ఓ అమ్మాయి. డాక్టర్ గా ఉన్న అమ్మాయితో..
యువహీరో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మహేంద్రబాబు, కిరణ్ బల్లాపల్లి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలకు రెడీ అవుతోంది. కాగా.. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్.. సినిమాపై ఆడియన్స్ కు ఇంట్రస్ట్ పెంచుతోంది.
సినిమాలు తీసే ఓ అబ్బాయి.. సినిమాలన్నా, సినిమా వాళ్లన్నా నచ్చని ఓ అమ్మాయి. డాక్టర్ గా ఉన్న అమ్మాయితో ఎలాగైనా సినిమా తీయాలని హీరో ప్రయత్నిస్తుంటాడు. ఎలాగో ఒకలా హీరోయినా సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటుంది. కానీ అది ఆమె తండ్రికి నచ్చదు. ఇదంతా ట్రైలర్ లో చూపించారు. ఆ తర్వాత ఏమైంది ? తెలియాలంటే పూర్తి సినిమాను తెరపై చూడాల్సిందే. ట్రైలర్ లాంచ్ సందర్భంగా మహేష్ బాబు "ఈ ట్రైలర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. చూస్తుంటే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేలాఉంది. సుధీర్ బాబు, కృతి శెట్టి, ఇంద్రగంటి మోహనశర్మలతో పాటు యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీనివాస్ అవసరాల, కల్యాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా హీరో విషయానికొస్తే.. రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. అతని సినిమాల్లో ఏదో కొత్తదనం ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఏదో కొత్తగా ట్రై చేసి ఉంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక వరుస ఫ్లాప్ లతో ఉన్న కృతిశెట్టికి ఈ సినిమా హిట్టైతేనే మరో సినిమా ఉంటుంది. ఉప్పెన తర్వాత కృతిశెట్టి ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. ఇటీవల విడుదలైన సినిమాల్లో బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ కాస్త ఫర్వాలేదనిపించినా.. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ అయ్యాయి.
Next Story