Mon Dec 23 2024 23:03:20 GMT+0000 (Coordinated Universal Time)
బాబాయ్ - అబ్బాయ్ లతో మహేష్ ఆట మామూలుగా ఉండదు
సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాలు , యాడ్స్ లోనే కాదు. బుల్లితెరమీద కూడా అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాలు , యాడ్స్ లోనే కాదు. బుల్లితెరమీద కూడా అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో ఇటీవలే పూర్తవ్వగా.. ప్రేక్షకులకు సెండాఫ్ ఎఫిసోడ్ లో మహేష్ బాబు గెస్ట్ గా వచ్చి.. ఆడనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ నేటి రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా.. నా రాజా అంటూ ఎన్టీఆర్ మహేష్ తో ఓ ఆట ఆడుకుంటారని తెలుస్తోంది.
బాలయ్యతోనూ...
అలాగే ఓటీటీ సంస్థ అయిన ఆహాలో బాలయ్య తో అన్ స్టాపబుల్ అనే సెలబ్రిటీ షో రన్ అవుతోంది. వారానికొక సెలబ్రిటీ ఇంటర్వ్యూతో ఈ షో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ప్రసారమైన మూడు ఎపిసోడ్ లలో మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి లతో బాలయ్య తన కామెడీ టైమ్ తో సందడి చేయగా.. నాల్గవ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నట్లు తెలుస్తోంది. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోగ్రామ్ కు సంబంధించిన ఓ ఫొటోను మహేష్ నెటిజన్లతో పంచుకున్నారు. "నా సాయంత్రాన్ని ఎన్బీకే గారితో 'అన్స్టాపబుల్'గా ఆనందించాను" అంటూ చెప్పుకొచ్చారు. నిన్నటితో షూటింగ్ పూర్తయింది. ఇది 4వ ఎపిసోడ్ గా ప్రసారం అవుతుందా ? లేదా అనేది షో నిర్వాహకులు ప్రకటించాల్సి ఉంది.
Next Story