Sun Dec 22 2024 17:49:18 GMT+0000 (Coordinated Universal Time)
SSMB 28 : మహేశ్- త్రివిక్రమ్ సినిమాలో డ్యూయల్ రోల్ నిజమేనా ?
ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై..
అతడు, ఖలేజా తర్వాత.. మరోసారి మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు రెట్టింపుగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు.
తాజాగా SSMB 28 గురించిన ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. తండ్రీ కొడుకులుగా మహేశ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఫేస్ టు ఫేస్ ఒకే ఫ్రేమ్ లో డ్యూయల్ రోల్ సీన్స్ ఉంటాయా లేదా అన్నది మాత్రం తెలియదు కానీ.. ఈ రూమర్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే మరోసారి మహేష్ కు జోడీ కడుతోంది. అలాగే శ్రీ లీల కూడా ఈ సినిమాలో నటిస్తోంది. అలాగే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తారని సమాచారం. SSMB 28 తర్వాత మహేష్ - రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది.
Next Story