Sun Dec 22 2024 17:39:29 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Karam : గుంటూరు కారంపై గరం.. గరం
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం పై ఆయన అభిమానులతో పాటు ఐపీఎస్ అధికారులు కూడా విమర్శలు చేస్తున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం పై ఆయన అభిమానులతో పాటు ఐపీఎస్ అధికారులు కూడా విమర్శలు చేస్తున్నారు. మాటల మాంత్రికుడు తివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు రోజుల క్రితం విడుదలయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. రివ్యూలన్నీ తివిక్రమ్ ను తిట్టిపోస్తూనే సాగాయి. మహేష్ బాబు అసలు ఈ కధను ఎలా అంగీకరించాడంటూ ఆయనపై ఫ్యాన్స్ కూడా ప్రశ్నలు కురిపిస్తున్నారు. అసహజత్వానికి నిదర్శనంగా ఈ సినిమాను చూడొచ్చంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎస్లతో పాటు...
ఇదిలా ఉండగా ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కూడా గుంటూరు కారం సినిమాపై ఘాటుగా ఎక్స్ లో స్పందించారు. తాను ఈ సినిమా చూడనని, దళితులను కించపరచే ఈ దర్శకుడిని, హీరోను దళితులంతా బాయ్కాట్ చేయాలంటూ సునీల్ ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. మరోవైపు తివ్రిక్రమ్ పై అనేక మంది ఫైర్ అవుతున్నారు. కొత్త కథలు రాయలేని, వెతుక్కోలేని నిస్సహాయత నుంచి.... ప్రయోగాత్మక చిత్రాలు తీసే ద_మ్ము_లేని తెలుగు హీరోల దద్ద_మ్మ_తనం నుంచి...కథ నుంచి ట్యూన్స్ వరకు కాపీ పోసిన పోత "గుంటూరు కారం" అంటూ ఒక నెటిజన్ ఫైర్ అయ్యాడు.
దళితులను కించపర్చేలా...
దళితులను కించపర్చే విధంగా విలన్లకు ఆ పేర్లు పెట్టడమే కాకుండా హీరోకు మందుపోస్తూ బతికే వాడి పేరు యాకోబు అంటూ పేరు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా ఒక వెకిలిగా ఉందని ఫైర్ అవుతున్నారు. కులతత్వంతో నిండిపోయిందని మండిపడుతున్నారు. నువ్వు క్రిస్టియన్ వా బే అని హీరో వెటకారగంగా అడిగే సీన్లు దళితులను కించపర్చే విధంగా ఉన్నాయంటున్నారు. అలాగే బ్రోకరిజం చేసి కమెడియన్ పేరు బాలసుబ్రహ్మణ్యంగా పేరు పెట్టి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టుకున్నావంటూ కితాబు ఇవ్వడమేంటని నిలదీస్తున్నారు. అణువణవునా కులతత్వాన్ని వెండితెర సాక్షిగా ప్రోత్సహించడం, దళిత బహుజనులను బానిసలుగా చిత్రీకరించడం పట్ల పెద్దయెత్తున విమర్శలు వినపడుతున్నాయి.
Next Story