Mon Dec 23 2024 06:55:21 GMT+0000 (Coordinated Universal Time)
Amar Deep-Supritha: అమర్దీప్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సురేఖవాణి కూతురు..
సురేఖవాణి కూతురు 'సుప్రిత' అమర్దీప్ సినిమాతో హీరోయిన్గా నటిస్తూ వెండితెర అరగేంట్రం చేయబోతుంది.
Amar Deep - Supritha: ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి, రన్నర్‌గా బయటకి వచ్చిన నటుడు 'అమర్దీప్'. తెలుగు సీరియల్స్ లో నటించి రెండు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న అమర్దీప్.. బిగ్‌బాస్ హౌస్ లో తన గేమ్ తో మరింత క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ క్రేజ్ ని ఉపదయోగించుకొని వెండితెర పై తన అదృష్టం పరీక్షించుకుందాం అని ప్రయత్నిస్తున్నారు.
గతంలోనే ఒక సినిమాలో నటించిన గుర్తింపు లభించలేదు. ఇప్పుడు బిగ్‌బాస్ ఇమేజ్ తో ఎంత సక్సెస్ అవుతాడో చూడాలి. అమర్దీప్ హీరోగా నటిస్తున్న ఈ కొత్త సినిమా ఓపెనింగ్ నేడు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా 'సుప్రిత' నటిస్తుంది. తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి సురేఖవాణి కూతురే.. ఈ సుప్రిత.
గత కొన్నాళ్లుగా అమ్మతో కలిసి సినిమా ఈవెంట్స్ కి హాజరవుతూ పరిశ్రమలో ఎక్కువ కనిపిస్తున్నా సుప్రిత.. సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే ఫోటోషూట్స్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో యూత్ లో ఈ భామకి మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పడింది. మరి ఇన్నాళ్లు తన అందాలతో ఆకట్టుకున్న సుప్రిత.. వెండితెరపై తన నటనతో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Next Story