పవన్ కన్నా ముందే అఖిల్!!
అక్కినేని అఖిల్ ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత అఖిల్ సినిమా విషయంలో చాలా ఊహాగానాలే నడిచాయి. [more]
అక్కినేని అఖిల్ ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత అఖిల్ సినిమా విషయంలో చాలా ఊహాగానాలే నడిచాయి. [more]
అక్కినేని అఖిల్ ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత అఖిల్ సినిమా విషయంలో చాలా ఊహాగానాలే నడిచాయి. అందులో ముఖ్యంగా సై రా దర్శకుడు సురేందర్ రెడ్డీ తో అఖిల్ నెక్స్ట్ అంటూ ప్రచారం జరిగింది కానీ ప్రకటన రాలేదు. నాగార్జున మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలయ్యాకే అఖిల్ నెక్స్ట్ డైరెక్టర్ విషయంలో ఓ క్లారిటీకి రావలని అనుకునే లోపు సురేందర్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూవీ చెయ్యడానికి రంగం సిద్ధం చేసేసాడు. పవన్ కళ్యాణ్ తో ఒప్పందం.. పవన్ పుట్టిన రోజునాడు ఆ సినిమాపై ప్రకటన అన్ని జరిగిపోయాయి, దానితో అఖిల్ అభిమానాలు కాస్త కలవరపడ్డారు.
అయితే సురేందర్ రెడ్డి తో అఖిల్ సినిమా ఉంటుంది అని అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా కన్నా ముందే అంటూ ప్రచారం జరుగుతుంది. అంటే పవన్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినా.. తాజాగా క్రిష్ సినిమా అలాగే హరీష్ శంకర్ తో చెయ్యబోయే సినిమాలు పూర్తయ్యాకే సురేందర్ రెడ్డి తో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ లోపు సురేందర్ రెడ్డి అఖిల్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఎలాగూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. సో ఆ సినిమా విడుదల కాగానే సురేందర్ రెడ్డి తో అఖిల్ సినిమా చేస్తాడని అంటున్నారు.