Sun Dec 22 2024 21:31:43 GMT+0000 (Coordinated Universal Time)
Suriya - Karthi : సూర్య, కార్తీ చుట్టూ వివాదం.. కోర్టులో కేసు..!
తమిళ దర్శకుడు కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీలపై కేసు ఫైల్ చేశారట. ఈ విషయంలో దర్శకుడికి మద్దతుగా సముద్రఖని..
Suriya - Karthi : కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీ చుట్టూ గత కొంతకాలంగా ఒక వివాదం నడుస్తుంది. 2007లో కార్తీని హీరోగా పరిచయం చేస్తూ తమిళ దర్శకుడు ఆమీర్ తెరకెక్కించిన సినిమా ‘పరుత్తివీరన్’ (Paruthiveeran). టీం వర్క్ బ్యానర్ పై ఆమీర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, జ్ఞానవేల్ రాజా సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నిర్మాణ విషయంలోనే వివాదం మొదలయింది. ఇప్పుడు ఈ వివాదంలోకి సముద్రఖని ఎంట్రీ ఇచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగింది..?
సూర్య, కార్తీ సినిమాలు నిర్మిస్తూనే జ్ఞానవేల్ రాజా బడా నిర్మాతగా ఎదిగారు. తమ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో మొదటి సినిమాని సూర్యతో చేసిన జ్ఞానవేల్.. రెండో సినిమాని కార్తీతో చేశారు. అయితే ఈ చిత్ర నిర్మాణంలో జ్ఞానవేల్, దర్శకుడు ఆమీర్ మధ్య విబేధాలు వచ్చాయట. ఈ విషయం ఇటీవల బయటకి వచ్చింది. ఇటీవల కార్తీ తన 25వ చిత్రం ‘జపాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి.. తన 25 చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్స్‌ని గెస్టులుగా ఆహ్వానించారు. ఈ ఈవెంట్ కి అమీర్ మాత్రమే హాజరుకాలేదు.
దీని గురించి ఆమీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "జపాన్ ఈవెంట్‌కు వెళ్ళడానికి అసలు తనకి ఆహ్వానం అందలేదని, జ్ఞానవేల్ రాజా వల్ల సూర్య, కార్తితో తనకి ఉన్న బంధం చెడిందని" చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలు పై జ్ఞానవేల్ స్పందిస్తూ.. "మేము ఆహ్వానం పంపించాం. కానీ అతనే రాలేదు. ‘పరుత్తివీరన్’ సినిమా నిర్మాణంలో అతను నన్ను ఇబ్బంది పెట్టాడు. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయించడమే కాకుండా తప్పు లెక్కలు చూపించి నా వద్ద నుంచి డబ్బులు దోచుకున్నాడు’’ అంటూ ఆరోపణలు చేశారు.
జ్ఞానవేల్ చేసిన వ్యాఖ్యలను ఆమీర్ ఖండించారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పి సినిమా నిర్మాణం మధ్యలోనే జ్ఞానవేల్ తప్పుకున్నారట. దీంతో ఆమీర్ బయట నుంచి అప్పులు తీసుకు వచ్చి సినిమాని పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని సముద్రఖని కూడా తెలియజేస్తూ జ్ఞానవేల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆ సినిమాలో నటించానని, షూటింగ్ సెట్స్ లో జ్ఞానవేల్ ఎప్పుడూ కనిపించలేదని చెప్పుకొచ్చారు.
ఆ సినిమా పూర్తి చేయడం కోసం ఆమీర్ ఎంత కష్టపడ్డాడో, ఎంతమంది దగ్గర అప్పులు చేశారో తనకి తెలుసని చెప్పుకొచ్చిన సముద్రఖని.. చివరిలో నిర్మాత అనే క్రెడిట్ ని జ్ఞానవేల్ తీసేసుకున్నారని తెలియజేశారు. కార్తీకి, జ్ఞానవేల్‌కి లైఫ్ ఇచ్చింది ఆమీర్ అని, అలాంటి వ్యక్తి పై ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని, అసలు జ్ఞానవేల్‌కి ఇంతటి ధైర్యం ఎలా వచ్చిందంటూ నిలదీశారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు బ్రో, ఇదేం బాలేదంటూ జ్ఞానవేల్‌పై అసహనం వ్యక్తం చేస్తూ సముద్రఖని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాగా ఈ విషయం గురించి అమీర్ న్యాయస్థానంలో జ్ఞానవేల్ రాజాతో పాటు సూర్య, కార్తీలపై కూడా కేసు ఫైల్ చేశారట.
Next Story