Mon Dec 23 2024 02:36:21 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి పీటలెక్కనున్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో పవన్ పక్కన నటించి అందరి దృష్టిని ఆకర్షిచింది. తాజాగా విడుదలైన..
చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. ఫేమ్ సంపాదించుకున్న ఓ యూట్యూబ్ స్టార్, షణ్ముఖ్ జశ్వంత్ హీరోయిన్ పెళ్లిపీటలెక్కనుంది. ఒక ఎంటర్టైన్ మెంట్ ఛానల్ లో 'అమ్మాయి క్యూట్ అబ్బాయి నాటు' అనే వెబ్ సిరీస్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మౌనిక రెడ్డి ఓ ఇంటి కోడలవుతుంది. ఇటీవలే షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి 'సూర్య' అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి విజయం అందుకున్న మౌనిక రెడ్డికి సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో పవన్ పక్కన నటించి అందరి దృష్టిని ఆకర్షిచింది. తాజాగా విడుదలైన విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' సినిమాలో కూడా ఒక పాత్ర చేసింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా.. పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది మౌనిక. తన స్నేహితుడు 'సందీప్ కురపాటి'ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న మౌనిక.. పెళ్లి తేదీని కూడా ప్రకటించింది. డిసెంబర్ 17,18 తేదీల్లో గోవాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
Next Story