సినిమా ఫ్లాప్… నిర్మాత సేఫ్..!
గత శుక్రవారం మంచి అంచనాల మధ్య విడుదలైన మెగా డాటర్ నిహారిక సూర్యకాంతం సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. కథ రొటీన్ గా ఉండడం, క్యారెక్టర్స్ [more]
గత శుక్రవారం మంచి అంచనాల మధ్య విడుదలైన మెగా డాటర్ నిహారిక సూర్యకాంతం సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. కథ రొటీన్ గా ఉండడం, క్యారెక్టర్స్ [more]
గత శుక్రవారం మంచి అంచనాల మధ్య విడుదలైన మెగా డాటర్ నిహారిక సూర్యకాంతం సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. కథ రొటీన్ గా ఉండడం, క్యారెక్టర్స్ బాగున్నా.. కథనంలో తేడా కొట్టడం, డైరెక్టర్ కి వెబ్ సీరియల్స్ తీసిన అనుభవంతో సూర్యకాంతం సినిమాని కూడా వెబ్ సీరిస్ లా మల్చడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక నిర్వాణ సినిమాస్ వారు సూర్యకాంతంతో భారీగా లాస్ అవుతారేమో అనుకున్నారు. గత శుక్రవారం లక్ష్మీస్ ఎన్టీఆర్, సూర్యకాంతం సినిమాలు పోటీ పడ్డాయి. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఫ్లాప్ టాక్ రావడం… గత నెలరోజులుగా థియేటర్స్ లో సినిమాలు లేకపోవడంతో సూర్యకాంతంకి కలిసొచ్చింది. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పర్వాలేదంటున్నారు.
మరో సినిమా లేకపోవడంతో
ఇక ఈ సినిమా లోబడ్జెట్ తో తెరకెక్కడం కూడా సినిమాకి లాస్ రాకుండా కాపాడింది. తక్కువ బడ్జెట్ లో తీయడం వల్ల ఈ సినిమా సేఫ్ అయ్యిందని అంటున్నారు. థియేట్రికల్ బిజినెస్ అటు ఇటుగా జరిగిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి సూర్యకాంతానికి లాస్ రాకుండా కొద్దిగా లాభాలొచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ వీకెండ్ లో 70 లక్షలకు పైగా రాబట్టిన సూర్యకాంతం.. మళ్లీ మజిలీ సినిమా థియేటర్స్ లోకి వచ్చేవరకు కోటి కొల్లగట్టడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. లాంగ్ రన్ లో కోటి వచ్చినా శాటిలైట్ హక్కులకు 2 కోట్లు సూర్యకాంతానికి వచ్చాయి కాబట్టి మొత్తం మూడు కోట్లకు పైగానే సూర్యకాంతం కొల్లగొడుతుందని అంటున్నారు. సినిమాకి చాలా తక్కువ బడ్జెట్ పెట్టడం వలనే ఈ మాత్రం లాభాలొచ్చాయని… అలా సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు సేఫ్ అయ్యారని అంటున్నారు.