Tue Apr 01 2025 23:42:28 GMT+0000 (Coordinated Universal Time)
నువ్వు కూడా సుశాంత్ దగ్గరికి వెళ్లిపోయావా : సోదరి భావోద్వేగ ట్వీట్
ప్రియాంక్ ట్వీట్ చూసిన నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆప్యాయంగా చూసుకునే యజమాని..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. అతను మరణించి మూడేళ్లైనా.. ఇప్పటికీ అతడిని మరచిపోలేదు అభిమానులు. 2020 జూన్ 14న ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ.. పోలీసులు తెలిపారు. అప్పట్లో.. సుశాంత్ మరణంతో అతని పెంపుడు కుక్క ఫడ్జ్ అతని రాకకోసం ఎంతగానో ఎదురుచూసింది. ఆ ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. తాజాగా.. ఫడ్జ్ కన్నుమూసింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి ప్రియాంక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
“ఫడ్జ్.. నువ్వు కూడా స్వర్గంలో ఉన్న ఈ స్నేహితుడి దగ్గరకు వెళ్లిపోయావు. మేము కూడా ఏదో ఒకరోజు మిమ్మల్ని అనుసరిస్తాం. అప్పటివరకు మాకు ఈ బాధ తప్పదు. మా గుండె ముక్కలయ్యింది” అంటూ భావోద్వేగ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఫడ్జ్ తో సుశాంత్ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. ప్రియాంక్ ట్వీట్ చూసిన నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆప్యాయంగా చూసుకునే యజమాని మరణించాక.. శునకాలు దిగులుతో మరణిస్తాయని కామెంట్ చేస్తున్నారు. సుశాంత్ మరణించిన తర్వాత ఫడ్జ్ అతని కోసం ఎంతో ఎదురుచూసింది. ఈ నష్టం భరించలేనిది.. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఒదార్చేందుకు మాటలు రావడం లేదు అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
కాగా.. సుశాంత్ మృతి కేసులో అతని ప్రియురాలైన రియా చక్రవర్తి అరెస్ట్ అయి.. కొద్దిరోజులకు బయటకి వచ్చింది. సుశాంత్ మరణం వెనుక ఏవో రహస్యాలున్నాయని, పోలీసులు వాటిని బయటకు రానీయడం లేదన్న వాదనలు గట్టిగానే వినిపించాయి. అతడి శరీరంపై గాయాలు ఉన్నాయని.. కళ్లపై కొట్టినట్లుగా.. అతని గొంతును కట్ చేశారంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. దీంతో సుశాంత్ మృతి కేసు మరోసారి తెరపైకొచ్చింది.
Next Story