సుశాంత్ సోదరితో గొడవ.. అందుకే రియా అలా!!
సుశాంత్ సింగ్ రాజపుట్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి నలిగిపోతుంది. రియా చక్రవర్తి వలనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సుశాంత్ సింగ్ రాజపుట్ తల్లితండ్రులు, బీహార్ పోలీస్ [more]
సుశాంత్ సింగ్ రాజపుట్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి నలిగిపోతుంది. రియా చక్రవర్తి వలనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సుశాంత్ సింగ్ రాజపుట్ తల్లితండ్రులు, బీహార్ పోలీస్ [more]
సుశాంత్ సింగ్ రాజపుట్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి నలిగిపోతుంది. రియా చక్రవర్తి వలనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సుశాంత్ సింగ్ రాజపుట్ తల్లితండ్రులు, బీహార్ పోలీస్ ల ఆరోపణ. కానీ ముంబై పోలీస్ లు మాత్రం రియని వెనకేసుకొచ్చే పనులను చేస్తున్నారు. ఇక రియా చక్రవర్తిని ఈడీ తో పాటుగా, సిబిఐ కూడా ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తూనే ఉంది. సుప్రీం కోర్టు నుండి తనకి అనుకూలంగా స్టే తెచ్చుకుందామని చూసిన రియా చక్రవర్తి కి అక్కడ చుక్కెదురు అయ్యింది. ఇక సుశాంత్ సింగ్ అకౌంట్ నుండి రియా చక్రవర్తి 15 కోట్ల లావాదేవీలు జరిపినట్టుగా కేసు నమోదు అయ్యింది. అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానికి కారకులంటూ రియని ఇప్పటికి సుశాంత్ సింగ్ అభిమానులు నిందిస్తూనే ఉన్నారు. అయితే రియా చక్రవర్తి తన లాయర్ తో కలిసి అసలు సుశాంత్ సింగ్ తో తనకెలా పరిచయం, అతనితో ఉన్న అనుబంధం, ఆయన ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ గురించి బయటపెట్టింది.
సుశాంత్ సింగ్ పరిచయం అయినా కొత్తల్లో రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ ఇంటికి వెళ్లిందట. 2019 లో జరిగిన ఓ పార్టీలో సుశాంత్ సింగ్ రాజపుట్ కి రియాకి స్నేహం కుదరడం తర్వాత ఇద్దరూ కలిసి ఓకె ఇంట్లో జీవించేవారట. అయితే ఓ రోజు సుశాంత్ సింగ్ ఇంట్లో జరిగిన పార్టీలో సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంక అతిగా మద్యం సేవించగా.. రియాకి కి నెక్స్ట్ డే షూటింగ్ ఉదనడంతో సుశాంత్ సింగ్ రూమ్ కి వెళ్లి నిద్రపోగా.. మిడ్ నైట్ లో తన పక్కన ప్రియాంక ఉండడం చూసి ప్రియాంకని నిద్రలేపి తన రూమ్ నుండి బయటికి వెళ్ళమని చెప్పిందట రియా. ఇదే విషయాన్నీ రియా సుశాంత్ కి చెప్పగా.. సుశాంత్ కి ఆయన సోదరి ప్రయాంకకి మధ్య గొడవ జరిగిందట. అప్పటినుండి రియా కి సుశాంత్ ఫ్యామిలీతో రిలేషన్ తెగిపోయిందట.
ఇక ఈఏడాది జూన్ లో సుశాంత్ తన ఫ్యామిలీ మెంబెర్స్ కి ఫోన్ చేసి తాను ముంబై నుండి వెళ్లిపోవాలని అనుకుంటున్నా అని.. ఎవరినైనా వచ్చి కలవమనగా.. దానికి సుశాంత్ సోదరి నీతూ వస్తానని చెప్పడంతో…. రియా ని తన ఇంటినుండి బయటికి వెళ్ళమని.. నా సోదరి వస్తుంది అని చెప్పగానే రియా సుశాంత్ సింగ్ ఇంటి నుండి జూన్ 8 న వెళ్లిపోయిందట. తర్వాత రియా మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు మానసిక వైద్యుడి దగ్గర మందులు వాడింది. ఇక ముంబై సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రే తో రియాకి ఎలాంటి సంబంధం లేదని.. అసలు ఆదిత్యని ఫొటోస్ లో చూడడం తప్ప కలిసినది లేదని రియా లాయర్ ప్రకటించడం ఇప్పుడు మరిన్ని ఆనుమానాలకు తావిస్తుంది.