బిగ్బాస్ 4 లో స్వాతి దీక్షిత్
వారం వారం ఇంట్రెస్టింగ్ టాస్క్ లతో ప్రేక్షకాభిమానం పొందుతోన్న బిగ్బాస్4 షోలో మరో కీలకమార్పు చోటు చెసుకొనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఓ [more]
వారం వారం ఇంట్రెస్టింగ్ టాస్క్ లతో ప్రేక్షకాభిమానం పొందుతోన్న బిగ్బాస్4 షోలో మరో కీలకమార్పు చోటు చెసుకొనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఓ [more]
వారం వారం ఇంట్రెస్టింగ్ టాస్క్ లతో ప్రేక్షకాభిమానం పొందుతోన్న బిగ్బాస్4 షోలో మరో కీలకమార్పు చోటు చెసుకొనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా దూసుకుపోతున్న బిగ్బాస్ మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చేసింది. ముచ్చటగా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తెలుగమ్మాయి అయిన హీరోయిన్ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4వ సీజన్ లోకి వెల్కమ్ చెప్పింది.
చిచ్చుపెట్టడం, చెదరగొట్టడం బిగ్ బాస్ స్టైల్. వీటి కోసమే సెపరేట్ టాస్క్ లు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే కొత్త హీరోయిన్ తో షోలో వేడెక్కించడంతో పాటు హౌజ్ కు మరింత గ్లామర్ జోడించనున్నారు స్వాతి దీక్షిత్.
రెండేళ్ల క్రితమే స్వాతికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, ఈ సీజన్ కు తన ఎంట్రీ అవసరం ఉందని స్వాతి డిసైడ్ అయింది. నటిగా ఇప్పటికే బెంగాలీ,తమిళ ,తెలుగు సినిమాలతో అలరించిన స్వాతి, హౌస్ మేట్ గా బిగ్ బాస్ లో అదరగొట్టెందుకు సిద్దమంటొంది . నిజానికి ఆర్.ఎక్స్100 సినిమాలో తొలుత స్వాతి నే హీరోయిన్. వారంపాటు షూటింగ్ చేసిన తర్వాత, ఆ బోల్డ్ రోల్ , తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గది కాదనీ ,సినిమా నుంచి తప్పుకుంది. పర్సనల్ గా స్వాతి నటిగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనె తండ్రిని కోల్పొయింది. ఆ బాధ ను తట్టుకుని ,మరొపక్క కుటుంబ భాద్యతలను కూడా తనపై వేసుకుని ,తనకంటూ ఓ ఐడెంటిటిని క్రియేట్ చెసుకునెందుకు స్వాతి సిద్దమయింది.
ఇక తెలుగు ప్రేక్షకుల ఆదరణ ,ఓ తెలుగుమ్మాయిగా తనకు ఉంటుందని ఆశిస్తూ.. తనవంతుగా దిబెస్ట్ కంటెస్టెంట్ గా ఈ రియాలిటీ షోలో గుర్తింపు తెచ్చుకుంటానంటొంది గ్లామరస్ స్వాతి దీక్షిత్…
- Tags
- Swathi Dikshith