Fri Apr 04 2025 14:20:58 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్కార్ కు వెళ్లిన తొలి తెలుగు సినిమాగా స్వాతిముత్యం రికార్డు
ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఓ మైండ్ ఎదగని మనిషిగా తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా..

ఆస్కార్.. ఈ అవార్డును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఇండస్ట్రీ. అలాంటి ఆస్కార్ ఇంతవరకూ ఒక్క తెలుగు సినిమాకూ రాలేదు. కానీ.. ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అధికారికంగా ఆస్కార్ లిస్టుకు వెళ్లిన తొలితెలుగు సినిమా స్వాతిముత్యం. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత దృశ్యకావ్యం ఈ సినిమా. ఆయన తీసిన ప్రతి సినిమాకు ఏదోక అవార్డు రావడం విశేషం. కె.విశ్వనాథ్ 1985లో దర్శకత్వం వహించిన సినిమా స్వాతిముత్యం. కమల్ హాసన్, రాధికా కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.
ఇప్పుడు మనం లోకనాయకుడిగా చెప్పుకుంటున్న కమల్ హాసన్ ఈ సినిమాలో తన అయోమయ నటనతో.. ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఓ మైండ్ ఎదగని మనిషిగా తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా.. జాతీయ చలనచిత్ర పురస్కారం, నంది అవార్డు, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్, ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ కు నంది అవార్డులు తెచ్చిపెట్టింది. భారతదేశం తరపున 59వ అకాడమీ అవార్డులకు బెస్ట్ ఫారిన్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ కు అధికారికంగా పంపిన తొలితెలుగు సినిమాగా స్వాతిముత్యం రికార్డు సృష్టించింది. ఇప్పుడు RRR ఆస్కార్ ముంగిట నిలిచి ఉంది కానీ.. ఈ సినిమా అధికారికంగా ఆస్కార్ కు వెళ్లింది కాదు. సొంతంగా ఆస్కార్ కు నామినేషన్లు పంపింది RRR సినిమా. అప్పటి స్వాతిముత్యం రికార్డును ఇంతవరకూ మరో సినిమా బ్రేక్ చేయలేదు.
Next Story