Mon Dec 23 2024 20:12:50 GMT+0000 (Coordinated Universal Time)
Nikhil Siddhartha : తండ్రి కాబోతున్న నిఖిల్ సిద్దార్థ..!
నిఖిల్ కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. నిఖిల్ తండ్రి కాబోతున్నాడట. ఇది నిజమేనా..?
Nikhil Siddhartha : టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ.. పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకొని భారీ సినిమాల్లో నటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. స్వయంభూ, ఇండియన్ హౌస్, కార్తికేయ 3 సినిమాలు నిఖిల్ లైనప్ లో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే, నిఖిల్ కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. నిఖిల్ తండ్రి కాబోతున్నాడట. ఇది నిజమేనా..?
ఇటీవల టాలీవుడ్ కమెడియన్ హర్ష ఇంట దివాళీ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ పార్టీకి టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఈక్రమంలోనే నిఖిల్ తన భార్య పల్లవి వర్మతో కలిసి అటెండ్ అయ్యారు. ఇక అక్కడ తన సతీమణితో కలిసి ఫోటోలకు నిఖిల్ ఫోజులివ్వగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అవి చూసిన అభిమానులు లైక్స్ కొట్టడమే కాకుండా.. మరో విషయం కూడా గమనించారు.
ఆ ఫొటోల్లో పల్లవి వర్మ బేబీ బంప్ తో కనిపిస్తున్నారని, ఆమె ప్రేగన్సీతో ఉన్నారా అని, నిఖిల్ త్వరలోనే తండ్రి కాబోతున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది ఈ గుడ్ న్యూస్ తమకి తామే నిర్దారించుకొని తెగ సంతోష పడిపోతున్నారు. మరి నిఖిల్ అభిమానులకు ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో చూడాలి. కాగా నిఖిల్ 2020లో పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పల్లవి వర్మ ఒక డాక్టర్.
ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్వయంభూ సినిమా కోసం కష్టపడుతున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాతో వందల ఏళ్ళ క్రితం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. పాతాళభైరవి, భైరవ దీపం సినిమా కథల తరహాలో ఈ మూవీ కూడా ఉండనుందట. ఈ సినిమాలో నిఖిల్ ఒక వారియర్ గా కనిపించబోతున్నారు. నిఖిల్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
Next Story