Mon Dec 23 2024 11:02:06 GMT+0000 (Coordinated Universal Time)
Devara : ‘దేవర’ ఎన్టీఆర్ లుక్.. సీక్రెట్ రివీల్ చేసేసిన నటుడు..
‘దేవర’లో ఎన్టీఆర్‌కి మరో సీక్రెట్ లుక్ ఉందట. దాని గురించి ఆ మూవీలో నటిస్తున్న కేజీఎఫ్ నటుడు బయటపెట్టేశారు.
Devara : కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే మూవీలోని యాక్షన్ పార్ట్ షూట్ అంతా పూర్తి చేసేశారు.
కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ రెండు లుక్స్ లో కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లుక్స్ కి సంబంధించిన ఓ సీక్రెట్ ని.. ఆ సినిమాలో నటిస్తున్న ఓ నటుడు రివీల్ చేసేశారు. కేజీఎఫ్ మూవీ ద్వారా మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నటుడు 'తారక్ పొన్నప్ప'.. దేవరలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. తాజాగా ఈ నటుడు ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో దేవర మూవీ గురించి, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మీకు ఓ సీక్రెట్ చెప్తానంటూ తారక్ పొన్నప్ప.. "ఇప్పుడు మీరు చూస్తున్న ఎన్టీఆర్ దేవర లుక్ నథింగ్. అసలు లుక్ ని ఇంకా సీక్రెట్ గా దాచారు. ఆ లుక్ ని మీరు చూస్తే.. చాలా థ్రిల్‌గా, కేజ్రీగా ఫీల్ అవుతారు. ఆ లుక్ చాలా రగ్డ్గా, ఊర మాస్‌గా ఉంటుంది. దేవరగా ఆయన నటన చూసి నాకు గూస్బంప్స్ వచ్చాయి" అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ తో దేవర పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఆ సెకండ్ లుక్ ని ఎప్పుడు రివీల్ చేస్తారా అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
ఇక ఇదే ఇంటర్వ్యూలో తారక్ పొన్నప్ప, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. "మొదటిసారి సెట్స్ లోకి వచ్చినప్పుడు నన్ను ఎన్టీఆర్ రిసీవ్ చేసుకున్న సందర్భం నాకు ఇంకా కళ్ళ ముందు మెదులుతున్నాయి. అంతగొప్పగా ఆయన నాకు స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను పునీత్ సార్ కూడా వర్క్ చేశాను. నాకు ఎన్టీఆర్ తో వర్క్ చేస్తున్నప్పుడు పునీత్ గారే గుర్తుకు వస్తున్నారు. మేము పెద్ద స్టార్స్ అనే యాటిట్యూడ్ ఇద్దరిలో ఏ మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరితో చాలా ఓపెన్‌గా ఉంటారు. వ్యక్తిత్వం పరంగా కూడా ఇద్దరు ఒకేలా ఉంటారు" అని చెప్పుకొచ్చారు.
Next Story