Mon Dec 23 2024 07:23:29 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతి స్పెషల్.. "గని" నుంచి తమన్నా స్పెషల్ సాంగ్ రిలీజ్ !
తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా ఒక స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. 'రింగారే రింగా రింగా ..
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు బాబీ - సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ తో పాటు లవ్, ఎమోషన్లను కూడా దర్శకుడు సమపాళ్లలో చూపిస్తాడని టాలీవుడ్ టాక్. వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ నటించింది. గని సినిమాతో ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కానుంది.
Also Read : రైల్వే గార్డ్ పేరు మార్చిన ఇండియన్ రైల్వే
తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా ఒక స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. 'రింగారే రింగా రింగా .. రింగా రింగా' అంటూ సాగే ఈ పాటలో.. మిల్కీ బ్యూటీ తమన్నా బాక్సింగ్ రింగ్ లోనే స్టెప్పులు ఇరగదీసింది. తమన్ బీట్, ఆ బీట్ కు తగ్గ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటాయి. కాగా.. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చగా.. హారిక నారాయణ్ ఆలపించింది.
Next Story