Mon Dec 23 2024 07:54:55 GMT+0000 (Coordinated Universal Time)
పది, పన్నెండు ఏళ్ల క్రితం నేను చేయలేనిది.. ఇప్పుడు చేయగలను: తమన్నా భాటియా
బాలీవుడ్ లో బబ్లీ బౌన్సర్, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది.
తమన్నా భాటియా.. దశాబ్దం పైగా దక్షిణాదిన, బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అటు వెబ్ సిరీస్ లలో కూడా సందడి చేస్తూ ఉంది. తమన్నా చేస్తున్న పాత్రలు కూడా మునుపటి లాగా లేవు. సైరా నరసింహా రెడ్డి సినిమాలో తమన్నా చేసింది చిన్న పాత్రే అయినా ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక ఆ తర్వాత ఎఫ్ 3 లో చేసినా కూడా చాలా వైవిధ్యమైన పాత్రను పోషించింది. ఇక సస్పెన్స్ తో నిండిన వెబ్ సిరీస్ లు.. గ్లామర్ తో కూడుకున్న స్పెషల్ సాంగ్స్ తో తమన్నా కెరీర్ లో ఎటువంటి బ్రేక్ లేకుండా ముందుకు వెళుతూ ఉంది.
బాలీవుడ్ లో బబ్లీ బౌన్సర్, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా భారత చలనచిత్ర పరిశ్రమలో మహిళలకు దక్కుతున్న ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ చిత్రపరిశ్రమలో మహిళల పాత్రలు కేవలం గ్లామర్ కోసమే ఉన్నాయా ? అనే ప్రశ్నపై తమన్నా మాట్లాడుతూ.. తాను మహిళ అందంగా కనిపించే చిత్రాలను చూసేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపింది. 17ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్నాను. కానీ ప్రస్తుతం నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని తెలిపింది. నా ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలను అన్వేషిస్తాను. మంచి కంటెంట్ ఉండి.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. దాదాపు పది, పన్నెండు ఏళ్ల క్రితం నేను చేయలేనిది.. ఇప్పుడు చేయగలనని తమన్నా చెప్పింది. అలాగే చాలా కాలం క్రితం ప్రేక్షకులు అంగీకరించని కంటెంట్ ఇప్పుడు అంగీకరిస్తారని అనుకుంటున్నానని వెల్లడించింది. ఆడియన్స్ సినిమాలు చూసే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయని తమన్నా వెల్లడించింది.
Next Story