Mon Dec 23 2024 07:42:39 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి రూమర్స్ పై స్పందించిన తమన్నా.. ఇతనే కాబోయే భర్తంటూ..
ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు, ఒప్పుకున్న ప్రాజెక్ట్ లనే పూర్తి చేసే పనిలో ఉందీ మిల్కీ బ్యూటీ.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. తాజాగా తమన్నా ఆ రూమర్స్ పై స్పందించింది. తనకు కాబోయే భర్తను పరిచయం చేసిందీ ముద్దుగుమ్మ. అది చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు, ఒప్పుకున్న ప్రాజెక్ట్ లనే పూర్తి చేసే పనిలో ఉందీ మిల్కీ బ్యూటీ. తమన్నా త్వరలో పెళ్లిపీటలెక్కనుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. తాను ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లాడబోతున్నట్లు వస్తున్న వార్తలకు తమన్నా బదులిస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పోస్ట్ పెట్టింది. అది కాస్తా వైరల్ గా మారింది.
'F3' మూవీలో తమన్నా మేల్ గెటప్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆ గెటప్ లో కనిపిస్తూ.. "ఇతనే నేను చేసుకోబోయే ఆ బిజినెస్ మ్యాన్" అని కౌంటరిస్తూ.. క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా హిందీ, మలయాళంలో ఒక్కొక్క సినిమా చేయగా.. అవి ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తెలుగులో చిరంజీవి సరసన 'భోళా శంకర్' మూవీలో నటిస్తుంది. ఇదే సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.
Next Story