Sat Dec 28 2024 06:42:41 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ నటుడి భార్య ప్రాణం తీసిన డైట్ ప్లాన్
డైట్ఎఫెక్ట్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సీనియర్ నటుడు కళ్యాణ్ కుమార్ తనయుడు, తమిళ నటుడు భరత్ కళ్యాణ్ భార్య..
ఇటీవల కాలంలో చాలా మంది తన ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఏ ఆహారం శరీరానికి మంచిదో ఆచితూచి మరీ ఎంచుకుంటున్నారు. బరువు ఎక్కువగా ఉన్నామని భావించే వారు.. తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ డైట్ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో రకరకాల డైట్ ప్లాన్ లు కనిపిస్తున్నాయి. బరువును నియంత్రించుకునే క్రమంలో సరైన డైట్ ఫాలో అవకపోతే ప్రాణానికే ప్రమాదం అనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది.
డైట్ఎఫెక్ట్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సీనియర్ నటుడు కళ్యాణ్ కుమార్ తనయుడు, తమిళ నటుడు భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శిని తన డైట్ మార్చుకున్న కారణంగా ప్రాణాలు కోల్పోయిందని తాజాగా వైద్యులు వెల్లడించారు. ప్రియదర్శిని రెండ్రోజుల క్రితం మరణించగా.. ఆమె మరణానికి గల కారణాలను వైద్యుల రిపోర్ట్స్ లో వెల్లడయ్యాయి. కొన్ని నెలల క్రితం ప్రియదర్శిని పలియో డైట్ తీసుకోవడం మొదలుపెట్టిందట. దీంతో ఒక్కసారిగా జరిగిన ఈ ఆహారం మార్పుల వల్ల ఆమె శరీరంలో షుగర్స్ లెవెల్ పడిపోయి ఆ తర్వాత సీరియస్ కావడంతో మూడు నెలల పాటు చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు.
కొద్దిరోజులకు కోమాలోకి వెళ్లిన ఆమె.. రెండ్రోజుల క్రితం కన్నుమూసింది. ప్రియదర్శిని మరణానికి డైట్ కారణం అని తెలియడంతో.. ఈ విషయం చర్చనీయాంశమైంది. ప్రియదర్శిని అనుసరించిన కొత్త డైట్ లో పాత ఉత్పత్తులు లేవు. పండ్లు, కూరగాయలు, చేపలు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినేవారు. అకస్మాత్తుగా ఆహారంలో మార్పు కారణంగా, ఆమె రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పు వచ్చింది. దాంతో ఆమె కోమాలోకి వెళ్లి.. కన్నుమూసింది. డైట్ ఫాలో అయ్యేవారు ఇకనైనా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఫిట్ గా ఉండటం అవసరమే. కానీ.. అది ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలి. భరత్, ప్రియదర్శిని దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2007లో వచ్చిన శ్రీరంగం అనే తమిళ సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చారు భరత్.
Next Story