Mon Dec 23 2024 14:33:21 GMT+0000 (Coordinated Universal Time)
Mansoor Ali Khan : త్రిషని రేప్ చేసే ఛాన్స్ రాలేదని ఫీల్ అయ్యా..
త్రిషని రేప్ చేసే ఛాన్స్ రాలేదు. అందుకు ఫీల్ అయ్యాను అంటూ మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి.
Mansoor Ali Khan : కోలీవుడ్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ విలన్ రోల్స్ తో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. తమిళంతో పాటు సౌత్ లోని పలు లాంగ్వేజ్స్ లో ఆయన ప్రతినాయకుడు పాత్రలు చేశారు. కాగా ఈ మధ్య పలు ఇంటర్వ్యూల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతున్నారు. జైలర్ సినిమాలో తమన్నా చేసిన 'కావాలా' పాట పై అభ్యంతరకర రీతిలో కామెంట్స్ చేసి వివాదం సృష్టించారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ త్రిష గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు.
మన్సూర్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను చాలామంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. వాటిని నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. లియో సినిమాలో త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నాను. కానీ అలాంటి సీన్ లేకపోవడం నేను ఫీల్ అయ్యాను" అంటూ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. వీటిపై త్రిష, మాళవిక మోహనన్, చిన్మయి, లోకేష్ కనగరాజ్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
త్రిష రియాక్షన్.. "రీసెంట్ గా మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడిన ఒక వీడియో నా దృష్టికి వచ్చింది. ఆయన మాట్లాడిన మాటలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలను అగౌరవపరిచేలా, కించపరిచేలా ఆయన మాటలు ఉన్నాయి. భవిషత్తులు ఆయన కలిసి మళ్ళీ ఎప్పుడు పని చేయను. నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఆయన లేకుండా చూసుకుంటాను. ఇలాంటి వారి వాళ్ళ మిగతా వారికీ కూడా చెడ్డ పేరు వస్తుంది" అంటూ ఆమె ట్వీట్ చేశారు.
లియో మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. "మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ నాకు బాధ కలిగించాయి, కోపం తెప్పించాయి. మేమంతా కలిసి ఒక టీంగా పని చేశాము. ఏ పరిశ్రమలో అయినా మహిళలను, తోటి ఆర్టిస్టుల పై గౌరవంగా ప్రవర్తించాలి. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను" ట్వీట్ చేశారు.
Next Story