Thu Apr 10 2025 13:12:18 GMT+0000 (Coordinated Universal Time)
శరత్ కుమార్ కు అస్వస్థత: ఆసుపత్రిలో చేరిక
తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు

తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. శరత్ కుమార్ డయోరియా వ్యాధితో ఆసుపత్రిలో చేరారని, డీహైడ్రేషన్ కు గురయ్యారని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆయన ఆసుపత్రిలో చేరడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెబుతున్నారు.
అభిమానుల ప్రార్థనలు...
శరత్ కుమార్ ను హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఆసుపత్రిలో శరత్ కుమార్ భార్య రాధిక, కూతురు వరలక్ష్మి కూడా ఉన్నారు. ఆయన వెంటనే కోలుకోవాని అభిమానులు ప్రార్థిస్తున్నారు. శరత్ కుమార్ త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రికి అభిమానులు చేరుకుంటున్నారు.
Next Story