Sun Dec 22 2024 22:33:40 GMT+0000 (Coordinated Universal Time)
Balakrishna : తమిళ నటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. బాలకృష్ణ గురించేనా.?
తమిళ నటి విచిత్ర చేసిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు బాలకృష్ణ గురించేనా..?
క్యాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక వీడని భూతంలా ఇంకా చాప కింద నీరులా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ టు బాలీవుడ్ దీనికి సంబంధించిన ఏదొక విషయం బయట పడుతూనే ఉంటుంది. అయితే తమిళ్ ఇండస్ట్రీలో దీని గురించి ఎక్కువ వినిపిస్తుంటుంది. సూచి లీక్స్, మీటూ, అలాగే సందర్భం దొరికినప్పుడల్లా అక్కడ దిగ్గజ రచయిత పై సింగర్ చిన్మయి చేసే ఆరోపణలు.. ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వినిపిస్తుంటాయి. తాజాగా ఆ పరిశ్రమలో మరో విషయం కూడా బయటకి వచ్చి సంచలనంగా మారింది.
అయితే ఈసారి ఈ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొన్నది తమిళ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. మన తెలుగు పరిశ్రమకు చెందిన స్టార్ హీరో బాలకృష్ణ. తమిళ నటి 'విచిత్ర' ఈ ఆరోపణలు చేశారు. 2002 తరువాత ఈమె సినిమాల్లో మళ్ళీ కనిపించలేదు. ఇందుకు కారణం కూడా ఆ క్యాస్టింగ్ కౌచ్ సంఘటనే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె తమిళ్ బిగ్బాస్ 7లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు. ఆ హౌస్ లోనే విచిత్ర ఈ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో బిగ్బాస్.. 'మీ జీవితాన్ని మలుపుతిప్పిన ఓ సంఘటన గురించి చెప్పండి' అని విచిత్రని ప్రశ్నించారు.
విచిత్రం ఏం చెప్పిందంటే..
"2000 సంవత్సరంలో నేనొక తెలుగు మూవీలో నటించాను. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటన.. నాకు అదే చివరి చిత్రం అయ్యేలా చేసింది. ఆ విషయాన్ని ఎంత మర్చిపోదామన్నా, నా గుండెల్లో అది రగులుతూనే ఉంది. ఆ మూవీ షూటింగ్ టైములో ఆ సినిమాలోని హీరో నుంచి నేను కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఒకరోజు సాయంత్రం ఓ పార్టీలో నేను ఆ మూవీ హీరోని కలుసుకున్నాను. అతనికి నా పేరు ఏంటో కూడా తెలియదు. కానీ అతను డైరెక్ట్ గా నన్ను తన రూమ్ కి రమ్మని అడిగాడు. ఒక్కసారిగా అలా అడిగేపాటికి నేను షాక్ అయ్యాను. దీంతో అక్కడి నుంచి నా రూమ్ కి వెళ్లి పడుకున్నాను. అయితే నెక్స్ట్ డే నుంచి నేను షూటింగ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాత్రుళ్ళు నా రూమ్ బయట గట్టిగా అరిచేవారు. నా డోర్ ని గట్టిగా బాదేవారు. ఆ విషయాలు నాకు ఇంకా గుర్తుకు ఉన్నాయి.
ఇక ఒకరోజు ఫైట్ షూటింగ్ టైంలో ఒక వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్స్ ని తాకాడు. మొదటిసారి ఏదో యాక్సిడెంటల్ గా జరిగిందని అనుకున్నాను. కానీ తరువాత కూడా అదే జరగడంతో ఆ విషయాన్ని అక్కడి ఉన్న స్టాండ్ మాస్టర్ కి వెళ్లి చెబితే.. ఆయన తిరిగి నన్నే చెంపపై కొట్టాడు. దీంతో అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయి అసోసియేషన్కు ఫిర్యాదు చేశాను. కానీ నాకు మద్దతుగా ఎవరూ రాలేదు. ఆ విషయాన్ని అంతా వదిలేసి నువ్వు నీ పని చూసుకొని వెళ్ళిపో అని యూనియన్ లీడర్ అనడం నాకు ఇంకా గుర్తుకు ఉంది" అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు..
ఈ విషయంలోకి బాలయ్య ఎలా వచ్చారంటే..
ఆమె మాట్లాడిన మాటల్లో ఆమె ఎక్కడా బాలకృష్ణ పేరు చెప్పలేదు. అయితే ఆమె చివరిగా నటించిన తెలుగు సినిమా అంటే బాలకృష్ణ మూవీనే. బాలయ్య 'భలేవాడివి బాసూ' సినిమాలో విచిత్ర కూడా నటించారు. ఆమె 2000వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా 2001లో రిలీజ్ అయ్యింది. దీంతో విచిత్ర మాట్లాడిన హీరో బాలయ్యే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి విచిత్ర చేసిన ఈ ఆరోపణలు నిజంగా బాలయ్యని ఉద్దేశించినవా..? అనేది తెలియాల్సి ఉంది.
అయితే కొంతమంది మాత్రం ఈ విషయం గురించి ఇలా ప్రశ్నిస్తున్నారు. బాలయ్య అలా చేశారా లేదా అనేది పక్కనపెడితే.. ఇన్నాళ్లు ఎందుకు ఈ విషయం బయట పెట్టలేదు..? సూచి లీక్స్, మీటూ సమయంలో అందరితో పాటు విచిత్ర కూడా ఎందుకు ఈ విషయం మాట్లాడలేదు..? ఇప్పుడు ఎలక్షన్స్ సమయంలోనే ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నారు..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద చర్చినీయాంశంగా మారింది.
Next Story