Mon Dec 23 2024 08:39:21 GMT+0000 (Coordinated Universal Time)
Vijaya Lakshmi : తమిళ నటి ఆత్మహత్య సెల్ఫీ వీడియో వైరల్..
కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన విజయ లక్ష్మి.. ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసారు.
Vijaya Lakshmi : కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన విజయ లక్ష్మి.. ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. బీపీ టాబ్లెట్స్ వేసుకొని ఆమె సూసైడ్ కి పాల్పడ్డారు. ఆమె ఇలా చేసుకోవడానికి గల కారణం ఇద్దరి రాజకీయ వ్యక్తులే అంటూ.. ఆ సెల్ఫీ వీడియోలో విజయ లక్ష్మి పేర్కొన్నారు.
సోషల్ మీడియా దుర్వినియోగం, బెదిరింపులు వల్లే తాను ఇంతటి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అసలు ఏమి జరిగిందంటే.. నామ్ తమిళర్ కట్చి పార్టీ నాయకుడు 'సీమాన్'తో ఆమె మూడేళ్లు రహస్య జీవితం గడిపారు. అయితే ఆమెను ఇప్పుడు మోసం చేసి సీమాన్ నడిరోడ్డుపై వదిలేసినట్లు చెప్పుకొచ్చారు.
ఇది ఇలా ఉంటే సీమాన్ మరియు ఇతర పార్టీ నాయకుడు 'హరి నాడార్' అనుచరులు మధ్య అభిప్రాయ భేదాల రావడంతో.. మధ్యలోకి విజయలక్ష్మిని తీసుకు వచ్చి, తనను వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. సీమాన్ మరియు అతని పార్టీ వ్యక్తులు తనని గత నాలుగు నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నట్లు, హరి నాడార్ వల్ల తనకి అవమానం జరిగినట్లు ఆమె పేర్కొన్నారు.
తనను ఆన్లైన్లో విపరీతంగా వేధింపులకు గురిచేసిన ఆ ఇద్దరి నేతలను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే తాను చనిపోవడానికి బీపీ టాబ్లెట్స్ వేసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, విజయ లక్ష్మి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది.
Next Story