Mon Dec 23 2024 15:22:51 GMT+0000 (Coordinated Universal Time)
హీరోయిన్ పై కూడా వేటు పడనుందా?
తమిళంలో అర్జున్ రెడ్డి రీమేక్ తీస్తున్న డైరెక్టర్ బాల కు ఊహించని షాక్ తగిలింది. విక్రమ్ కుమారుడు ధ్రువ సినీ రంగం ప్రవేశం చేస్తూ తీసిన ఈసినిమాకు [more]
తమిళంలో అర్జున్ రెడ్డి రీమేక్ తీస్తున్న డైరెక్టర్ బాల కు ఊహించని షాక్ తగిలింది. విక్రమ్ కుమారుడు ధ్రువ సినీ రంగం ప్రవేశం చేస్తూ తీసిన ఈసినిమాకు [more]
తమిళంలో అర్జున్ రెడ్డి రీమేక్ తీస్తున్న డైరెక్టర్ బాల కు ఊహించని షాక్ తగిలింది. విక్రమ్ కుమారుడు ధ్రువ సినీ రంగం ప్రవేశం చేస్తూ తీసిన ఈసినిమాకు వర్మ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తరువాత అవుట్ ఫుట్ చూసి నిర్మాతలు సినిమాను మళ్లీ రీషూట్ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో డైరక్టర్ బాలపై వేటుపడడం ఖాయమనే విషయం తేలిపోయింది.
సేమ్ హీరోని పెట్టి షూట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు అందరి చూపు హీరోయిన్ పైనే. అవును ఇందులో హీరోయిన్ గా నటించిన మేఘ చౌదరిపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఈసినిమా టీజర్ చూసిన చాలామందికి హీరోయిన్ నచ్చలేదు. అందుకే ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. అయితే ఈ విషయం గురించి తనకు ఏ మాత్రం తెలియదు అని చెబుతుంది మేఘ.
నేను బర్త్ డే వేడుకల్లో బిజీగా ఉన్నానని, ఎవరూ తనకు సమాచారం ఇవ్వలేదని అంటోంది. మళ్లీ తనను హీరోయిన్ గా తీసుకుంటారో లేదో కూడా క్లారిటీ లేదు అని చెబుతుంది. ఈసినిమా నిర్మాతలకే కాదు హీరో విక్రమ్ కు కూడా నచ్చలేదట. అందుకే విక్రమ్ రీషూట్ కోసం కొంత డబ్బు ఇస్తాను సినిమా మొత్తాన్ని రీషూట్ చేయాల్సిందిగా నిర్మాతల్ని కోరినట్టు తెలుస్తోంది. ఈనెల లో రిలీజ్ రావాల్సిన ఈసినిమా జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
Next Story