Thu Dec 19 2024 16:11:13 GMT+0000 (Coordinated Universal Time)
46ఏళ్ళ వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ కమెడియన్ని గుర్తు పట్టారా..?
ఇటీవల బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాల్లో అలరించిన ఒక స్టార్ కమెడియన్.. 46 ఏళ్ళ లేటు వయసులో ప్రేమ వివాహం చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు.
Redin Kingsly : ఇటీవల రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాల్లో తనదైన మార్క్ కామెడీతో ఆడియన్స్ ని అలరించిన ఒక స్టార్ కమెడియన్.. 46 ఏళ్ళ లేటు వయసులో ప్రేమ వివాహం చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు. ప్రస్తుతం ఆ కమెడియన్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో మీరు గుర్తు పట్టారా..?
తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన డాక్టర్, బీస్ట్, జైలర్ చిత్రాల్లో కమెడియన్ గా నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు 'రెడిన్ కింగ్స్లీ'. ప్రస్తుతం రెడిన్ కింగ్స్లీ.. తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ యాక్టర్ గా మారిపోయారు. ఇక ఇన్నాళ్లకు నుంచి సింగల్ ఉన్న రెడిన్ కింగ్స్లీ ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నారు.
గత ఏడాది కాలం నుంచి రెడిన్ కింగ్స్లీ.. తమిళ నటి సంగీతతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. సంగీత తమిళ సీరియల్స్‌లో నటిస్తూ వస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించారు. కాగా ఇప్పుడు వీరిద్దరి ప్రేమ ప్రయాణాన్ని ఏడడుగులు వేసి పెళ్లి ప్రయాణంగా మార్చుకున్నారు. కర్ణాటక మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్, పలువురు ప్రముఖులు రెడిన్ కింగ్స్లీ, సంగీతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఆ ఫోటోలు, వీడియోలను మీరు కూడా చూసేయండి.
Next Story