Sun Dec 22 2024 21:45:17 GMT+0000 (Coordinated Universal Time)
అభిమాని చనిపోయాడని తెలిసి.. ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చిన సూర్య..
తమిళ స్టార్ హీరో సూర్య తన అభిమానుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటుంటాడు. వారికీ ఏమైనా అయ్యిందని తెలియగానే వెంటనే రెస్పాండ్ అవుతుంటాడు.
తమిళ స్టార్ హీరో సూర్య.. తన అభిమానుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటాడు. వారికీ ఏమైనా అయ్యిందని తెలియగానే వెంటనే రెస్పాండ్ అవుతుంటాడు. వాళ్ళు ఎలా ఉన్నారు అని తనే స్వయంగా సంప్రదించి విషయం తెలుసుకుంటాడు. ఇలాంటి సందర్భాలు చాలానే అయ్యాయి. ఈ మధ్య కాలంలో జరిగినవి చెప్పాలంటే, కొన్ని రోజులు క్రితం విదేశంలో ఉన్న ఒక తెలుగు మహిళా అభిమాని దుండగుల కాల్పుల్లో మరణించిందని తెలుసుకున్న సూర్య.. ఆమె మరణానికి చింతిస్తూ ఒక ఎమోషనల్ లెటర్ ని రాసి ఆ కుటుంబానికి సానుభూతుని తెలియజేశాడు.
ఈమధ్య సూర్య పుట్టినరోజు వేడుకలో ఒక అభిమాని కరెంటు షాక్ తో మరణించాడు. అది తెలుసుకున్న సూర్య.. వెంటనే ఆ ఫ్యామిలీ మెంబెర్స్ కి వీడియో కాల్ చేసి తన ఓదార్పుని అందించాడు. తాజాగా చెన్నైలోని ఒక అభిమాని రోడ్డు ప్రమాదం చనిపోయాడని తెలుసుకున్న సూర్య.. తన బిజీ షెడ్యూల్ లో కూడా వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించాడు. అలాగే అభిమాని ఫోటోకి నివాళ్లు అర్పించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సూర్య నటిస్తున్న సినిమాలు విషయానికి వస్తే.. ప్రెజెంట్ 'కంగువ' మూవీలో నటిస్తున్నాడు. సూర్య వారియర్ గా నటిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాని కోలీవుడ్ మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ 2D అండ్ 3D ఫార్మట్స్ లో రూపొందుతుంది. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ డియోల్, జగపతి బాబు, కోవై సరళ, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
Next Story