Tue Dec 24 2024 03:22:35 GMT+0000 (Coordinated Universal Time)
కూతురు మాత్రమే కాదు విజయ్ ఆంటోనీ తండ్రి కూడా ఆత్మహత్య..
విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఆంటీని తండ్రి కూడా..
సంగీత దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చి ప్రస్తుతం హీరోగా తమిళ్ అండ్ తెలుగులో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నటుడు 'విజయ్ ఆంటోని'. నిన్న (సెప్టెంబర్ 19) ఈ హీరో ఇంట తీవ్ర విషాదం జరిగిన సంఘటన అందరికి తెలిసిందే. 16 ఏళ్ళ వయసున్న విజయ్ ఆంటోని కూతురు మీరా.. మంగళవారం తెల్లవారుజామున ఆళ్వార్‌పేటలోని తమ నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఉదయం మూడు గంటల సమయంలో మీరా తన గదిలో ఉరి వేసుకుని కనిపించడంతో ఆమెను వెంటనే చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొనడంతో విజయ్ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది.ఇది ఇలా ఉంటే, గతంలో విజయ్ ఆంటోని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ ఆంటోనీ కూతురు మాత్రమే కాదు అతని తండ్రి కూడా ఆత్మహత్య చేసుకొనే మరణించారట. విజయ్ ఆంటోని తండ్రి మద్యానికి బానిసవ్వడంతో.. ఒక సమయంలో బాగా ఎమోషనల్ అయ్యి ఆత్మహత్యకు పాల్పడినట్లు విజయ్ పేర్కొన్నాడు.
దీంతో విజయ్ తన 7 ఏళ్ళ వయసు నుంచే తండ్రి లేకుండా పెరిగాడు. ఇక ఇప్పుడు విజయ్ కూతురు కూడా ఆత్మహత్య చేసుకునే మరణించడం బాధాకర విషయం. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. అది చూసిన నెటిజెన్స్ కూడా బాధ పడుతున్నారు. కాగా విజయ్ ఆంటోని కూతురు చనిపోవడానికి గల కారణం ఏంటనేది ఇంకా క్లారిటీగా తెలియలేదు. కొన్నాళ్ల నుంచి మీరా డిప్రెషన్ తో పోరాడుతున్నట్లు తమిళ మీడియా పేర్కొంది.
మీరా ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. విజయ్ ఆంటోని కి మొత్తం ఇద్దరు పిల్లలు. మీరాతో పాటు మరో కూతురు కూడా ఉంది. మీరా పెద్ద అమ్మాయి. కాగా ఇటీవల విజయ్ కూడా భారీ యాక్సిడెంట్ అయ్యింది. బిచ్చగాడు 2 షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కి గురైన విజయ్.. చావు అంచులు వరకు వెళ్లివచ్చాడు. దాని నుంచి కోలుకోక ముందే ఇప్పుడు ఇలా జరగడం బాధాకరం.
Next Story